HometelanganaDeer Meat: : జింక కూర అని కుక్క మాంసం అమ్మకం 🐕🥠

Deer Meat: : జింక కూర అని కుక్క మాంసం అమ్మకం 🐕🥠

Telugu Flash News

Deer Meat: వన్యప్రాణుల మాంసం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమను కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

నిర్మల్ జిల్లా పొట్ట పెల్లి(కె) గ్రామానికి చెందిన శ్రీనివాస్, చామన్ పల్లి గ్రామానికి చెందిన వరుణ్ లక్ష్మణచందా పట్టణానికి వెళ్లారు. అక్కడ ఆనంద్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క చోరీకి గురైంది. ఆ తర్వాత శ్రీనివాస్, వరుణ్ కలిసి కుక్కను తీసుకెళ్లి చంపేశారు. ఈ మాంసాన్ని చుట్టుపక్కల గ్రామాలకు తీసుకెళ్లి జింక మాంసంగా విక్రయిస్తున్నారు. అయితే చుట్టుపక్కల అడవులు ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు నిజంగానే జింక మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు.

ఆనంద్ తన పెంపుడు కుక్క దొంగిలించబడిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. కుక్కను శ్రీనివాస్, వరుణ్ తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.

జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించినట్లు నిందితులు శ్రీనివాస్, వరుణ్ అంగీకరించారు. అయితే జింకల మాంసం పేరుతో కుక్క మాంసం తింటున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమకేం జరుగుతుందోనని భయపడుతున్నారు.

read more :

Robbery : దొంగతనానికి వచ్చి.. ఛార్జింగ్ పెట్టి.. ఫోన్ మర్చిపోయిన దొంగ 📱

-Advertisement-

🎶’ఆదిపురుష్’ నుంచి ‘శివోహం’ సాంగ్ రిలీజ్!🙏

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News