HometelanganaRevanth Reddy : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు..!

Revanth Reddy : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు..!

Telugu Flash News

Revanth Reddy : తెలంగాణ విమోచన దినోత్సవం నాడు సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారైనా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

వారు ఐదు ముఖ్యమైన అంశాలతో ప్రజల వద్దకు వెళతారు. అగ్రనేతల లభ్యతను బట్టి బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబరు 9న సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు కానుక అందజేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని ప్రముఖ హోటల్‌లో శుక్రవారం జరిగిన యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. ఎన్నికల యుద్ధంలో విజయం సాధించేందుకు యువత ముందుండి పోరాడాలని ఈ సందర్భంగా రేవంత్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇందుకు అవసరమైన చర్యలకు సంబంధించి యూత్ కాంగ్రెస్ కు మార్గదర్శకాలు ఇచ్చామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రముఖంగా పనిచేసినవారే రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు అవుతారని గుర్తు చేశారు. మోదీ, కేసీఆర్ లను గద్దె దించేందుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలని సూచించారు. నాయకుడిగా ఎదగడానికి ఇదొక రంగం అన్నారు. ఇందుకు ఉదాహరణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేనే అని వివరించారు.

1200 మంది విద్యార్థులు, యువత త్యాగాలతో తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. డబుల్‌ ఇంజిన్ అంటే అదానీ మరియు మోదీ అని , ఈ డబుల్‌ ఇంజన్ దేశాన్ని దోచుకుంటోందని ఆయన మండిపడ్డారు. . ‘వన్ నేషన్ వన్ పార్టీ’ అనేది బీజేపీ సీక్రెట్ ఎజెండా అని విమర్శించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టి దేశంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలన్నారు.

త్వరలో ఎన్నికలు రానున్నాయని, కావున కార్యకర్తలంతా చైతన్యవంతం కావాలని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ను ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గడీల పాలనను పునరుద్ధరించేందుకే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని రేవంత్ విమర్శించారు.

-Advertisement-

ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీ పేరుతో వేల ఎకరాలు సేకరించారన్నారు. భూస్వాముల కోసమే ధరణి తీసుకొచ్చారని కొందరు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ ను పూర్తిగా తొలగిస్తామన్నారు. 97 శాతం భూ వివాదాలు ఇలాంటి వెబ్‌సైట్‌ల వల్లే జరుగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు ధరణిని కచ్చితంగా రద్దు చేస్తామన్నారు. భూ అక్రమాలకు పాల్పడిన అధికారులను శిక్షిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ పెద్దల వద్ద ఉండాల్సిన సమాచారం దళారుల చేతికి చిక్కిందని అంటున్నారు. ధరణి రద్దు చేస్తే కేసీఆర్ కు ఎందుకంత బాధ , తండ్రీ కొడుకులు ఏడ్చినా కూడా జైలుకు పంపుతామని హెచ్చరించారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని రేవంత్ చెప్పారు.

2014 అనంతర అభివృద్ధిపై చర్చకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సిద్ధమా? అని రేవంత్ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్ చిల్లర నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. . తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఈ దొంగల పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.

read more news :

Horoscope (10-06-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News