రష్యా ఉక్రెయిన్ (Russia-Ukraine) మధ్య రగడ ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు యుద్ధం ఆపే దిశగా ఏ మాత్రం ఆలోచనలు చేయడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ పంతం వీడటం లేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. ఇరు దేశాల్లోనూ వేలాది మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. సామాన్య ప్రజలు కూడా సమిధలయ్యారు. తాజాగా రష్యా చీఫ్ పుతిన్‌పై హత్యాయత్నం కూడా జరిగింది. ఈ ఘటనతో రష్యా మరింత ఉడికిపోతోంది. జెలెన్స్కీని చంపేయడమే తమముందున్న మార్గమని రష్యా ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇలా యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ సమాజం తలదించుకొనేలా ఓ ఘటన జరిగింది. ఉష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై బాహాబాహీ పట్టారు. వేదికపైనే గొడవకు దిగడం చర్చనీయాంశమైంది. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ ఎంపీ.. ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఈ గొడవ టర్కీ రాజధాని అంకారాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు ఏడాదికిపైగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది.
ఈ సమయంలోనే మొదటిసారి అంకారాలో బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై ఉక్రెయిన్ తరఫున ఎంపీ ఒకరు తన దేశ జెండాను ప్రదర్శించారు. అదే సమయంలో అక్కడే ఉన్న రష్యన్ ప్రతినిధి కవ్వించారు. ఆ జెండాను లాక్కొని దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఉక్రెయిన్ ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రష్యా వ్యక్తిపైకి వేగంగా వెళ్లి దాడి చేశారు. అనంతరం తన జెండాను వెనక్కి తీసుకొచ్చారు. ఒక్కసారిగా ఈ చర్య జరగడంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఏం జరుగుతోందో తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
🥊 In Ankara 🇹🇷, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia 🇷🇺 tore the flag of Ukraine 🇺🇦 from the hands of a 🇺🇦 Member of Parliament.
The 🇺🇦 MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
అనంతరం ఇద్దరూ కొట్టుకోకుండా విడదీశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మీడియాలో ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడకపోయినప్పటికీ ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. రష్యా అధ్యక్ష కార్యాలయమైన క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా కస్సుబుస్సులాడుతోంది. అయితే, ఈ దాడికి తాము కారణం కాదని ఉక్రెయిన్ వెల్లడించింది. తాజాగా ఈ ఘటన జరగడంతో మరింత ఉద్రిక్తత దిశగా పరిస్థితులు వెళ్తున్నాయి.
Sharwanand: జనవరిలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న శర్వా ఇంకా పెళ్లి పీటలెక్కడంలేదు ఎందుకు..!
NTR : మళ్లీ బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి.. ఈ సారి రచ్చ వేరే లెవల్లో…