Weather Today : తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కాస్త చల్లని కబురు చెప్పారు. వచ్చే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రానున్న ఐదు రోజులులకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వడగండ్లతో కూడిన వర్షం అక్కడక్కడా కురిసే చాన్స్ ఉంది. తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షం పడే చాన్స్ ఉంది.
మరోవైపు హైదరాబాద్‌లో ఆకా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్టం 37 డిగ్రీలు, కనిష్టం 23 డిగ్రీలుగా నమోదవుతాయి. ఇక ఏపీలో అధిక పీడన ప్రాంతం మధ్య బంగాళాఖాతంలో విశాఖకి తూర్పున కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తేమ గాలులు నేరుగా ఆంధ్రాలోని కొస్తా భాగంలోనికి దూసుకెళ్తున్నాయి.
ఇవాళ మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ పిడుగులు, వర్షాలు నేడు మధ్యాహ్నం మొదలై రాత్రి వరకు కొనసాగే చాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.
also read :
Suma Adda : అదేంటి.. హీరో గోపీచంద్ ఏకంగా సుమ గొంతు పట్టేసుకున్నాడు..!
Horoscope (25-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?