అందమైన అధరాల కోసం…గులాబీలు మీ పెదాలపై పూయాలంటే …సున్నితమైన పెదాలను సున్నితం గానే చూసు కోవాలి. ఎలాగంటే …
- అందమైన అధరాల కోసం గులాబీ రేకులను పాలతో నూరి పేస్టులా చేసి పెదాలకు రాసి కొంతసేపు ఉంచుకొని కడిగేసుకోవాలి.
- ఒక చెంచా శనగపిండి, మీగడ, నిమ్మరసం కలిపి పెదవులకు పూసి అరగంట తర్వాత కడిగేసుకుంటే పెదాలు గులాబీ రేకుల్లా మెరుస్తాయి.
- తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాత్రిపూట పడుకునే ముందు రాసి మర్దన చేసుకుంటే పెదాల పైనున్న నలుపు హుష్ కాకి!
- పాలమీద మీగడను పెదాలపై మర్దన చేస్తే పెదాలు మృదువుగా మెరుస్తూ కనిపిస్తాయి.
- నిద్రపోయే ముందు పెదాలకు నెయ్యి రాస్తే పెదాలు పగలనే పగలవు.
- చిటికెడు తేనెలో అంతే మోతాదులో కీర రసం లేదా క్యారెట్ రసం కలిపి రాత్రి పడుకునే ముందు పెదాలకు రాస్తే ఉదయానికి సున్నితంగా పూలరెక్కల్లా ఉంటాయి.
- ఆపిల్ గుజ్జులో వెన్న కలిపి పెదాలకు రాస్తే పగిలిన పెదవులు త్వరగా మామూలు స్థితికి వస్తాయి.
- తేనెలో కొత్తిమీర రసం కలిపి పెదవులకు రాసుకుంటే చలికాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. నల్లగా ఉన్న పెదవులు ఎర్రబడతాయి కూడా !
- ప్రతిరోజూ చిటికెడు వెన్న కానీ, నెయ్యి కానీ పెదవులకు రాస్తే శీతాకాలం సమస్యలు హుష్ …కాకే !
- రెండు టేబుల్ స్పూన్ల తేనెలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అంతే మోతాదు గ్లిజరిన్ కలిపితే లిప్ బామ్ రెడీ ! ప్రతిరోజూ పెదవులకు ఒకేసారి తయారు చేసుకొని రాసు కోవచ్చు.
-Advertisement-