Immunity Foods : మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం ఏం తినాలో తెలుసుకోండి ..
1. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యం. కరోనా మహమ్మారి అటాక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ బూస్ట్‌పై శ్రద్ధ వహిస్తున్నారు.
2. సీజన్లు మారుతున్నప్పుడల్లా శరీరం జబ్బుల బారిన పడుతుంటుంది. వీటిని తట్టుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
3. కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం.
4. స్వీట్ పొటాటో తీసుకోవడం వల్ల విటమిన్ ఏ పుష్కలంగా దొరుకుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. దాంతోపాటు యూవీ రేస్ వల్ల కలిగే నష్టాలను అరికడుతుంది.
5. అవకాడో ఫ్రూట్ తీసుకుంటే విటమిన్ ఈ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడీని రక్షించడంలో తోడ్పడతాయి.
6. వైట్ బ్లడ్ సెల్స్‌ను కాపాడుకొనేందుకు డార్క్ చాక్లెట్ తినాలి.
7. కూరల్లో వెల్లుల్లిని భాగం చేయాలి. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
8. బాదంపప్పు రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ ఈ లభిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
9. బత్తాయి, నారింజ, నిమ్మ, ద్రాక్ష లాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధికి దోహదం చేస్తాయి.
10. పసుపును కూరల్లో భాగం చేయాలి. అలాగే దానిమ్మ పండు తింటే అనేక రకాల బ్యాక్టీరియాలతో ఫైట్ చేస్తుంది.
మరిన్ని చదవండి :
ICC: మ్యాచ్‌లు ఆడకుండానే టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా.. ఐసీసీకి నెటిజన్ల చురకలు
Viral video : రోడ్డుపై బైక్‌లో కపుల్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్
ఎన్టీఆర్ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళి.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!