HomesportsICC: మ్యాచ్‌లు ఆడ‌కుండానే టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా.. ఐసీసీకి నెటిజ‌న్ల చుర‌క‌లు

ICC: మ్యాచ్‌లు ఆడ‌కుండానే టాప్ ర్యాంక్‌లో నిలిచిన టీమిండియా.. ఐసీసీకి నెటిజ‌న్ల చుర‌క‌లు

Telugu Flash News

ICC: భార‌త జ‌ట్టు గ‌త ఏడాది అంత పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోలేదు. ముఖ్యంగా టెస్ట్‌ల‌లో భార‌త ప్ర‌ద‌ర్శ‌న‌పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొన్న‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా టాప్‌లో ఉండ‌గా, ఇప్పుడు మ్యాచ్‌లు ఆడ‌కుండానే టాప్‌లో క‌నిపించింది ఇండియా. దీంతో అంద‌రు అవాక్క‌య్యారు. వారం పది రోజుల క్రితం వరకూ ఆస్ట్రేలియానే నంబర్ వన్‌గా ఉండేది కదా.. ఈ గ్యాప్‌లో టెస్టు క్రికెట్ ఆడుకుండానే.. ఆసీస్‌ను భారత్ ఎలా వెనక్కి నెట్టింది అని అందరు ఆశ్చ‌ర్య‌పోయారు. ఐసీసీ వెబ్‌సైట్లో చోటు చేసుకున్న తప్పిదం వల్ల ఇలా జరిగింది. వాస్తవానికి 126 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. కానీ ఐసీసీ వెబ్‌సైట్లో మాత్రం ఇండియా 115 పాయింట్లతో నంబర్ వన్‌గా ఉందని.. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నట్లు కనిపించింది.

అయితే తప్పిదాన్ని గమనించిన ఐసీసీ.. వెంట‌నే దాన్ని సరి చేసింది. కానీ అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తప్పిదం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆడనున్న భారత్.. ఆసీస్‌ను ఓడిస్తే నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఐసీసీ వెబ్ సైట్ లో దొర్లిన మ‌రో త‌ప్పిదం ఏంటంటే.. టెస్టు ర్యాంకింగ్స్‌ పాకిస్థాన్ (88 పాయింట్లు) ఆరో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ (79 పాయింట్లు) 8వ స్థానంలో ఉన్నాయి. కానీ ఐసీసీ వెబ్‌సైట్లో తప్పుదొర్లిన సమయంలో పాకిస్థాన్ కంటే వెస్టిండీస్ ముందు ఉన్నట్లు ఉంది

ఐసీసీ వెబ్‌సైట్లో ఉన్న గణాంకాలు పొరబాటున వచ్చాయని తెలియక.. రోహిత్ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచిందని.. రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక మూడో స్థానానికి పడిపోయిందని విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలోనే టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది కదా.. హిట్ మ్యాన్‌ను ఇప్పటికైనా ప్రశంసించండి’ అని ట్వీట్లు చేసారు. టీ20ల్లో ఇప్పటికే నంబర్ వన్‌గా ఉన్న టీమిండియా.. కివీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే.. లాంగ్ ఫార్మాట్లోనూ టీమిండియానే నంబర్ వన్‌గా నిల‌వ‌డం ఖాయం.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News