Homecinemaఎన్టీఆర్‌ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళి.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!

ఎన్టీఆర్‌ వర్ధంతి.. కుటుంబ సభ్యుల నివాళి.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు!

Telugu Flash News

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీనియర్‌ ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ప్రముఖులంతా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. నటుడుగా, ముఖ్యమంత్రిగా, ఆత్మీయ నేతగా పేరు గడించిన ఎన్టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ కుమారులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సహా కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

jr ntr and kalyan ram

నివాళి అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ తనయుడిగా జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజల జీవితాలకు అండగా నిలిచిన ఘనత ఎన్టీఆర్‌దని బాలకృష్ణ చెప్పారు. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇచ్చిన అన్నగా చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. అలాంటి మహానుభావుణ్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని బాలకృష్ణ చెప్పారు.

తెలుగు ప్రజల హృదయాల్లో చోటు దక్కించుకోవడం ఆయనకే సాధ్యమైందన్న బాలకృష్ణ.. తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన ఆస్థి అని చెప్పారు. ఇది కేవలం పార్టీ కాదని, గొప్ప వ్యవస్థ అని చెప్పారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకీ లేరని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్‌ చేసిన మేలు ఎవరూ చేయలేదని బాలకృష్ణ చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా కష్టపడాలని బాలయ్య కోరారు.

మరోవైపు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులైన నందమూరి రామకృష్ణ, తనయ సుహాసిని కూడా ఎన్టీఆర్‌కు నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్‌ వేరుగా పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు కార్యకర్తలు కూడా పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.

-Advertisement-

also read:

Sriharikota News : జవాను ఆత్మహత్య.. జవాను భార్య కూడా.. శ్రీహరికోటలో తీవ్ర విషాదం.. అసలేం జరుగుతోంది ?

pakistan news : భారత్ తో తాము చేసిన తప్పును తెలుసుకున్నామని పాక్ ప్రధాని

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News