Homebeautyమీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?

మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?

Telugu Flash News

How to Get Soft Hands : ఉదయం లేచిన దగ్గరనుంచి అందరూ చేతులతోనే పని చేస్తారు. కానీ వాటినసలు పట్టించుకోరు. వాటి సహాయం లేకుండా ఒక్క పని కూడా చేయలేం. అలాంటి వాటిని ఎంత అపురూపంగా చూసుకోవాలి ?

  1. అతి వేడి లేదా అతి చల్లని పదార్థాలను సరాసరి చేతులతో తాకకూడదు.
  2. బట్టలుతికిన వెంటనే చేతులను, వెనిగర్ లేదా నిమ్మరసం కలిపిన నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఏమైనా ‘బ్లూ’ వంటి మరకలు అంటినా పోతాయి.
  3. మీ చేతులను 5 నిముషాలు గోరువెచ్చని నీటిలో ఉంచితే మృదువుగా, నాజూకుగా తయారవుతాయి.
  4. బట్టలు ఉతికేటప్పుడు వాడే సబ్బులు, డిటర్జెంట్లు చేతులకు హాని కలిగించకుండా ఉండాలంటే చేతులకు గ్లోవ్స్ వాడాలి.
  5.  మోచేతుల దగ్గర నలుపును నిమ్మచెక్కతో రుద్దటం వలన పోగొట్టుకోవచ్చు.
  6.  పాత్రలు తోమేటప్పుడు ఉంగరాన్ని ఎడమచేతికి మార్చు కోవాలి. బంగారు గాజులున్న వాళ్ళు మణికట్టు దగ్గర సన్నపాటి గుడ్డ కట్టుకుంటే వాటిని అరుగుదల నుంచి కాపాడడమే కాకుండా తమ మెరుపును కోల్పోకుండా మీ చేతికి అందాన్నిస్తాయి.
  7. కొద్దిగా నిమ్మరసంలో కొంచెం పంచదార కలిపి చేతులకు పట్టించి మర్దనా చేసుకుంటే చేతుల్లో బిరుసుతనం పోతుంది.
  8. రోమాలు పెరిగే దిశగా కోల్డ్ వాక్స్ రాసి మందపాటి గుడ్డతో రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో గట్టిగా రుద్దితే వెంట్రుకలు ఊడివస్తాయి! ఆ తర్వాత కోల్డ్ క్రీమ్స్ లో మాలిష్ చేసుకోవాలి.

మరిన్ని అందమైన వార్తలు చదవండి

శంఖం లాంటి కంఠం మీకుంటే ఎంత అందం? ఇలా చేసి చూడండి ..

అందమైన అద్దాల్లాంటి చెక్కిళ్ళు మీకు కావాలంటే ..ఈ చిట్కాలు పాటించండి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News