HometelanganaTelangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల కాక.. సీనియర్ల గుర్రు.. తదుపరి పరిణామాలెలా ఉంటాయి?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల కాక.. సీనియర్ల గుర్రు.. తదుపరి పరిణామాలెలా ఉంటాయి?

Telugu Flash News

తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో కమిటీల నియామకం అగ్గి రాజేసింది. మామూలుగానే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లు ఉంటుందని చెబుతారు. అలాంటిది ఇలా పదవులు, కమిటీల నియామకంలో సరితూకంగా ఉండాలంటే చాలా కష్టతరమైన టాస్క్‌ అవుతోంది. తాజాగా టీపీసీసీ కమిటీల నియామకం జరిగింది. ఇందులో తమ పేరు లేదని చాలా మంది సీనియర్లు అలకబూనారు. మరోవైపు ప్రాధాన్యత, ప్రాతినిధ్యం లేదని పలువురు అలిగి రాజీనామా కూడా చేసేశారు. పదవులు దక్కని నేతల్లో అసంతృప్తి భగ్గుమంది.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో నిన్న హైడ్రామా నడిచింది. సీనియర్‌ నేతలు, పదవులు ఆశించి భంగపడ్డ నేతలంతా భట్టి నివాసానికి క్యూ కట్టారు. తమ ఆవేదనను వెళ్లగక్కారు. మధుయాష్కీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డితోపాటు సీనియర్‌ నేత వి.హనుమంతరావు, ఇతర ముఖ్య నేతలంతా భట్టితో భేటీ అయ్యారు. కమిటీల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అంతృప్తి వ్యక్తం చేశారు.

ఆదివారం కమిటీల ప్రకటన వెలువడగానే పలువురు నేతలు రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. ఈ లిస్టులో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్‌ కూడా ఉన్నారు. పీఏసీలో చోటు కల్పించకపోవడంపై అలిగిన ఆయన రాజీనామా చేశారు. టీపీసీసీ కమిటీల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పదవుల కోసం బడుగు, బలహీన వర్గాలు పోరాడాల్సి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా…

మరోవైపు అసంతృప్త నేతలతో భేటీ తర్వాత మాట్లాడిన భట్టి విక్రమార్క.. పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న వారికి అవకాశం దక్కకపోవడం విచారకరమని పేర్కొన్నారు. తొలి నుంచి పార్టీలో చురుగ్గా పని చేస్తున్న వారికి అవకాశాలు దక్కలేదని, ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భట్టి చెప్పారు. ఇక కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పీసీసీ కమిటీలపై స్పందించారు. తనకు కనీస ప్రాతినిధ్యం లభించకపోవడంపై భట్టికి ఫోన్‌ చేసి వాపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమిటీల నియామకంపై అధిష్టానం మరోసారి దృష్టి సారించి అసంతృప్త నేతలను బుజ్జగించే అవకాశం ఉందో లేదో వేచి చూడాల్సిందే.

also read news:

H1B Visa: అమెరికాలో భారతీయుల యాతన.. ఉద్యోగాల తొలగింపులో కొత్తకోణం!

-Advertisement-

special stories : శాంటా క్లాస్ గా మారి చిన్న పిల్లల కోరికలు తీరుస్తున్న ఆ ఇద్దరు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News