Sore throat : గొంతు నొప్పి మనకు అప్పుడప్పుడు సర్వసాధారణం. ఇక సీజన్ మారినప్పుడు కూడా గొంతునొప్పి వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. గొంతునొప్పి, ఇన్ఫెక్షన్, మంట, సరిగా మాట్లాడలేకపోవడం వంటి సమస్యలన్నీ దీని నుంచే వస్తాయి. కానీ అలాంటి గొంతు నొప్పిని వదిలించుకోవడానికి అనేక నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి . దానికి ఇంగ్లీషు మందు లేదు. ఈ క్రమంలో గొంతు నొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే, వేడి చికెన్ సూప్ తాగండి. ఆ సమస్యలకు చికెన్ సూప్ ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు జలుబు చేసినా తగ్గుతుంది.
2. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి టీ తయారు చేసి వేడిగా త్రాగాలి. ఈ మసాలా టీతో గొంతు నొప్పి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి.
3. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. ఇలా చేస్తే చిక్కటి అల్లం రసం అవుతుంది. తర్వాత రసాన్ని వడకట్టి వేడి వేడిగా తాగాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి క్షణాల్లో తగ్గుతుంది.
4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి. వీటిలో ఉండే సహజ యాంటీబయాటిక్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.
ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. జలుబు కూడా తగ్గుతుంది.
5. మిరియాల పులుసు లేదా మిరియాలతో మరిగించిన పాలు తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
also read :
dry cough home remedies : పొడి దగ్గు తగ్గించే అమేజింగ్ చిట్కాలు మీ కోసం!
cold remedies : ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గుకు పరిష్కారం.. ఇలా ట్రై చేయండి!