Telugu Flash News

18-03-2024 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today in telugu ఈ రోజు రాశి ఫలాలు

today horoscope in telugu : మార్చి 18, 2024 ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం

ఈ రాశి వారి కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందడంతో సంతోషంగా ఉంటారు.. ముఖ్యమైన పనుల్లో మిత్రుల స‌హాయం అందుతుంది.

వృషభం

ఈ రాశి వారికి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వ‌స్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైన అవ‌స‌రం. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది.

మిథునం

ఈ రాశి వారికి ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది.. పెళ్లి సంబంధం విషయంలో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగించే అవ‌కాశం ఉంది. బంధువులతో విభేదాలకు అవకాశం ఎక్కువ‌ ఉంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.

సింహం

ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి ఎక్కువ అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తకుండా చూసుకకుంటే మంచిది .ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

కన్య

ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు ఈ రోజు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

తుల

ఈ రాశి వారికి మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏ మాత్రం లోటు ఉండదు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం చాలా ఉత్త‌మం.. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు.

వృశ్చికం

ఈ రాశి వారు బంధువులతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు ఎంతో సహాయంగా ఉంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగే అవ‌కాశం ఉంది. అనారోగ్యం నుంచి కొంత‌ ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి చెందుతారు.

ధనుస్సు

ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల మంచి జరుగుతుంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఎక్కువ‌. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం

ఈ రాశి వారు పట్టుదలగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తోబుట్టువులకు వీలైనంతగా సహాయం చేస్తారు.. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల నుంచి మంచి సమాచారం కూడా అందుతుంది. విద్యార్థులకు అంతా మంచిగానే ఉంటుంది.

కుంభం

ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు క్ర‌మంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేసే అవ‌కాశం ఉంది. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఎక్కువ‌.

మీనం

ఈ రాశి వారికి డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండ‌డం మంచిది.. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు క్ర‌మంగా పెరుగుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండ‌డం ఉత్త‌మం.

also read :

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Mahabharatham story in telugu : మహాభారతం.. పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం..

 

Exit mobile version