Sunday, May 12, 2024
HomeinternationalZelensky: తదుపరి యుద్ధం.. కాస్త సమయం కావాలన్న జెలెన్‌స్కీ

Zelensky: తదుపరి యుద్ధం.. కాస్త సమయం కావాలన్న జెలెన్‌స్కీ

Telugu Flash News

Zelensky: ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ఏడాది దాటిపోయినా కొనసాగుతూనే ఉంది. రష్యా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఆ దేశ సైనికులను వెనక్కు పంపేందుకు తమకు మరికాస్త సమయం కావాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా పేర్కొన్నారు. గురువారం ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. వార్‌లో సెకండ్‌ పర్వాన్ని ఇప్పుడే మొదలు పెట్టడం తమకు చాలా సులభమైన పని అంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

అయితే, అలా చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారని జెలెన్‌స్కీ చెప్పారు. ఇది ప్రజామోదం కాదని పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై రష్యా కూడా దాదాపు ఇదే వైఖరిని వెల్లడించింది. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా కాపాడటానికే ఉక్రెయిన్‌లో తమ పోరాటాన్ని కాస్త నెమ్మదిగా చేస్తున్నామని రష్యా పేర్కొంది. ఈ మేరకు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఇక రష్యా బలగాలను కట్టడి చేసేందుకు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణులను అందిస్తున్నట్లు బ్రిటన్‌ సర్కార్‌ గురువారం తెలిపింది. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌లో చట్ట సభ్యులకు రక్షణ శాఖ మంత్రి బెన్‌ వాలేస్‌ వివరాలు వెల్లడించారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ అందిస్తున్న స్టామ్‌ షాడో క్షిపణులు రష్యా ఆక్రమిత క్రిమియా సహా 250 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే లక్షాలపై కూడా దాఆడులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి రష్యాకు ఆయుధాలు ఎగుమతి అయినట్లు ఆదేశంలోని అమెరికా రాయబారి రూబెన్‌ బ్రిగేటి ఆరోపించారు.

ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యా యత్నం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన పుతిన్.. నాజీయిజం నిజ రూపాన్ని పాశ్చాత్య దేశాలు సృష్టిస్తున్నాయని ఆరోపణలు చేశారు. మన మాతృభూమికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం ప్రారంభమైందంటూ వ్యాఖ్యలు చేశారు. నేటి ప్రపంచం నిశ్చయాత్మకమైన మలుపులో ఉందని పుతిన్‌ చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విక్టరీ సాధించినందుకు ఏటా నిర్వహించే విజయోత్సవాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News