Friday, May 10, 2024
Homeandhra pradeshRajinikanth : రజనీకాంత్‌పై వైసీపీ అటాక్.. చంద్రబాబును పొగడటంపై నేతల కౌంటర్లు!

Rajinikanth : రజనీకాంత్‌పై వైసీపీ అటాక్.. చంద్రబాబును పొగడటంపై నేతల కౌంటర్లు!

Telugu Flash News

Rajinikanth : దివంగత ఎన్టీ రామారావు శతజయంతి కార్యక్రమాల్లో భాగంగా మాజీ సీఎం చంద్రబాబును సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల శంఖారావానికి ముఖ్య అతిథిగా విజయవాడకు వచ్చిన రజనీ.. హైదరాబాద్‌ నగరం గురించి, చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఏపీలో అధికార పార్టీ వైసీపీ మండిపడుతోంది. అసలు రజనీ ఏమన్నారు? వైసీపీ ఎందుకు కౌంటర్‌ ఇస్తోంది? చంద్రబాబు గురించి భాగ్యనగరం గురించి రజనీ ఏమన్నారో చూద్దాం..

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్‌ వచ్చారు. తాను 22 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే హైదరాబాద్‌కు వచ్చానన్న రజనీ.. అసలు ఇండియాలో ఉన్నానా.. న్యూయార్క్‌లో ఉన్నానా? అనేది అర్థం కాలేదన్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని చంద్రబాబు బాగా అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు రజనీకాంత్‌.

దాంతోపాటు బాలయ్య గురించి కూడా మాట్లాడారు. బాలయ్య తంతే కారు 30 అడుగులు దూరంలో పడుతుందని, ఆయనకు కోపం ఎక్కువ కానీ మనసు వెన్న అన్నారు. బాలయ్య మరిన్ని విజయాలు అందుకోవాలని రజనీ కాంక్షించారు.

చంద్రబాబు గురించి మాట్లాడితే తనకు జ్ఞానం పెరుగుతుందని రజనీ పేర్కొన్నారు. బాబుతో తనకు 30 ఏళ్ల పరిచయం ఉందన్న సూపర్‌స్టార్.. చంద్రబాబు దూరదృష్టితో చేసిన విజన్‌ 2047 అనుకునట్లే అమలైతే ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ అవుతుందన్నారు.

-Advertisement-

ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ భగ్గుమంది. మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రిరోజా తదితరులు తలైవా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్‌పై వైశ్రాయ్‌ హోటల్‌ వేదికగా చెప్పులు విసురుతున్నప్పుడు రజనీకాంత్‌ సిగ్గు, శరం లేకుండా చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజనీ.. ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబును పొగుడుతున్నారని, ఇది ప్రజలు విశ్వసించరని కొడాలి నాని చెప్పారు.

మూడు రోజులు షూటింగ్‌లు చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే రజనీ ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నలు వేశారు కొడాలి నాని. రజనీకాంత్‌ మాటల్ని ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు.

రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ రజనీ చేసిన వ్యాఖ్యల్ని తెలుగు ప్రజలు విశ్వసించరని చెప్పారు. మరోవైపు రజనీకి ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని, ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా మండిపడ్డారు.

ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పిస్తే జనం నమ్మరనే విషయం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో వీడియోలు రజనీకాంత్‌కు ఇస్తానని రోజా స్పష్టం చేశారు.

also read :

shruti haasan: నెటిజ‌న్స్ చెత్త ప్ర‌శ్న‌ల‌కు శృతి హాస‌న్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్

Akhil: అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి అసలు కార‌ణం చెప్పిన వేణు స్వామి

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News