Sunday, May 12, 2024
HomecinemaYashoda Movie Review : స‌మంత 'య‌శోద' మూవీ రివ్యూ..

Yashoda Movie Review : స‌మంత ‘య‌శోద’ మూవీ రివ్యూ..

Telugu Flash News

Yashoda Movie Review : 

నటీనటులు: సమంత ,ఉన్ని ముకుందన్ , మురళి శర్మ, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్,
దర్శకుడు : హరి , హరీష్
నిర్మాత : శివ లెంక కృష్ణ ప్రసాద్
బ్యానర్లు : శ్రీదేవి మూవీస్
మ్యూజిక్ : మణిశర్మ
డీఓపీ : ఏం సుకుమార్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

యశోద మూవీ రేటింగ్:  3 /5

లేడి స్టార్ హీరోయిన్ స‌మంత వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆమె లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కువ‌గా చేస్తుంది. యూటర్న్, ఓ బేబి చిత్రాల‌తో అల‌రించిన స‌మంత ఇప్పుడు య‌శోద‌, శాకుంత‌లం చిత్రాల‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది.నేడు య‌శోద చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించ‌గా, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో సమంతకి థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పుడు సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లులుగా మారుస్తున్న వైనం మ‌నం చూస్తూనే ఉన్నాం. స‌రోగ‌సీ విష‌యంలో పెద్ద మాఫియా న‌డుస్తుంది. ఆ మాఫియా చేసే అకృత్యాల వల్ల బలైన ఎంతోమంది యువతులు ఉండ‌గా, వారిలో ఒకరు యశోద..అసలు సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఏమిటి..? సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను వారు ఏమి చేస్తున్నారు..? యశోద ఛేదించిన ఆ భయంకరమైన నిజాలు ఏమిటి ? అంత పెద్ద మాఫియా సామ్రాజ్యం ని యశోద ఒక్కతే ఎదుర్కొని ఎలా గెలిచింది? అనేది సినిమా మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌:

yashoda movie reviewఈ సినిమాకి స‌మంత స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అని చెప్పాలి. సమంత ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించేసింది. ఎమోష‌న‌ల్, యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో అద‌ర‌గొట్టింది. సరోగసి కి గురవుతున్న ఒక అమాయిక మహిళగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక నెగటివ్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన కూడా బాగుంది. మిగ‌తా పాత్ర ధారులు ఉన్ని ముకుందన్, సంపత్ , రావు రమేష్ మరియు మురళి శర్మ నటనలు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే సినిమాని చాలా గ్రిప్పింగ్‌గా తెర‌కెక్కించారు హ‌రి- హ‌రీష్‌. క‌థ‌, స్క్రీన్ ప్లే విష‌యంలోచాలా జాగ్ర‌త్తలు తీసుకున్న‌ట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది..ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

-Advertisement-

ప్ల‌స్ పాయింట్స్:

సమంత నటన
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే
ఇంటర్వెల్ సన్నివేశం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

స్లోగా సాగిన స్క్రీన్ ప్లే

చివ‌రిగా..

ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద సినిమా అద్బుతం అని చెప్పాలి . సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి ఇతర నటీనటులు ఆమెకు ఫుల్ సపోర్ట్ చేయ‌డంతో సినిమా అంతా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఓ క్రైమ్ యాక్షన్ స్టోరీకి ఎమోషన్స్ జోడించి దర్శకులు హరి-హరీష్ ఆకర్షణీయంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగగా, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో ఆకర్షణ. సరోగసీకి బలవుతున్న అమాయకపు మహిళల గురించి ఆలోచింపజేసే చిత్రంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచారు.

also read news:

Bigg Boss 6: కెప్టెన్సీ ఫైట్.. ర‌చ్చ‌గా మారిన గేమ్.. రేవంత్ రూల్స్‌తో విసిగిపోయిన రోహిత్

Horoscope : 11-11-2022 రాశి ఫలాలు..ఈ రాశి వారికి ధనలాభయోగం

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News