Homeinternationalబెర్నార్డ్ ఆర్నాల్ట్ : తన కూతురికి వ్యాపార బాధ్యతలు.. ప్రపంచం కుబేరుడి ప్రకటన

బెర్నార్డ్ ఆర్నాల్ట్ : తన కూతురికి వ్యాపార బాధ్యతలు.. ప్రపంచం కుబేరుడి ప్రకటన

Telugu Flash News

తన కూతురికి వ్యాపార బాధ్యతలు అప్పగించబోతున్నట్టు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రకటన.ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి కొత్త పదవిలో బాధ్యతలు నిర్వహించబోతున్న డెల్ఫిన్.

ప్రముఖ వ్యాపారవేత్త,ప్రపంచం కుబేరుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ త్వరలో తన కూతురుకి వ్యాపార బాధ్యతలు అప్పగించబోతున్నాన్న విషయాన్ని తెలిపారు.ఈ విషయాన్నే ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

అసలు విషయంలోకి వెళ్తే 73 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్ట్ తన వ్యాపార సామ్రాజ్యంలో ప్రధాన భాగమైన క్రిస్టియన్ డియోర్(Christian Dior) కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూతురు డెల్ఫిన్‌(Delphine Arnault)ను నియమించినట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని గార్డియన్ పత్రిక నివేదికలో అధికారికంగా వెల్లడించింది.

బెర్నార్డ్‌కు చెందిన LVMH లగ్జరీ గూడ్స్ వ్యాపార సామ్రాజ్యంలో క్రిస్టియన్ డియోర్ కంపెనీ రెండో అతిపెద్ద బిజినెస్ యూనిట్. డియోర్ కంపెనీలో మేజర్ షేర్ హోల్డర్ అయిన ఆర్నాల్డ్ 1984 నుంచి ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా,ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. దీనితో పాటు లూయిస్ విట్టన్, టిఫనీ, గివెన్చీ, కెరింగ్ అండ్ మోయెట్ హెన్నెస్సీతో లాంటి ఎన్నో హైఎండ్ వ్యాపారాలనూ కలిగి ఉన్నారు.

382 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీ రీఆర్గనైజేషన్‌లో భాగంగా తన పెద్ద కుమార్తెకు డియోర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్,ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనునట్టు ఆయన ప్రకటించారు.

అయితే ప్రస్తుతం డెల్ఫిన్ లూయిస్ విట్టన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు వహిస్తున్న ఆమె దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రొడక్షన్‌కు ఇన్‌ఛార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

-Advertisement-

ఇక ఆమె ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త పదవిని చేపట్టనున్నారు. కాగా ప్రస్తుతం 47 సంవత్సరాల వయసున్న డెల్ఫిన్ డియోర్ సంస్థకు చీఫ్‌గా ఎంపికవ్వడంపై ఆర్నాల్ట్ స్పందించారు. ఇప్పటికే డెల్ఫిన్ నాయకత్వంలోని లూయిస్ విట్టన్ ప్రొడక్ట్స్ కొత్తదనాన్ని సంతరించుకున్నాయని, దీంతో ఆ సంస్థ బాగా అభివృద్ధి చెందిందని అన్నారు.

సేల్స్ రికార్డు స్థాయిలో ఊపందుకున్నాయని,ఇలాంటి అనుభవాలన్నీ డియోర్‌కి ఎంతో ఉపయోగపడతాయని అర్నాల్ట్ చెప్పుకొచ్చారు. కొత్త సంస్థలో కొత్త బాధ్యతలు నిర్వర్తించడానికి ఈ ఎక్స్పీరియన్స్ ఆమెకు ఉపయోగపడుతుందని అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

చిన్నప్పటి నుంచి డెల్ఫిన్‌కు ఫ్యామిలీ బ్రాండ్ల గురించి ఎక్కువగా తెలియదని, ఒక అత్యంత ధనవంతుల బిడ్డగా ఆమెను ఏనాడూ పెంచలేదని అర్నాల్డ్ చెప్పారు. తన 18వ ఏట పుట్టినరోజుకు బ్యాగ్ లేకపోతే అప్పుడు లూయిస్ విట్టన్ బ్రాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చినానని, ఆమెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే విలాసవంతమైన పార్టీకి అటెండ్ అయిందని చెప్పుకొచ్చారు. తనను సీఈఓగా కంపెనీకి మంచే చేస్తుందని భావిస్తున్నానని అన్నారు.

also read news:

BCCI:టీమిండియా జ‌ట్టులో జడేజాకి ఛాన్స్ లేన‌ట్టేనా… బీసీసీకి పెద్ద త‌ల‌నొప్పులు…!

Samantha: స‌మంత ఒంట‌రిత‌నంతో ఆవేద‌న చెందుతుందా… ఆమెకు తోడు వారిద్ద‌రేనా..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News