HomewomenWomen’s Day Special : ఓ రైతుకు ఐదుగురు కుమార్తెలు.. అందరూ ఐఏఎస్ అధికారులే!

Women’s Day Special : ఓ రైతుకు ఐదుగురు కుమార్తెలు.. అందరూ ఐఏఎస్ అధికారులే!

Telugu Flash News

Women’s Day Special story : మనదేశంలో ఆడ పిల్ల అంటే ఇప్పటికీ కొందరికి చిన్న చూపు ఉంటుంది. ఆడ పిల్ల తక్కువ, మగపిల్లాడైతే వారసుడు.. కోరినవన్నీ ఇచ్చేయడం.. ఇలా కొందరు తల్లిదండ్రులు వ్యవహరిస్తుంటారు. అయితే, ప్రస్తుతం మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలోనే పురిట్లోనే ఆడ శిశువులను చంపేసిన రాష్ట్రంలో, నిత్యం బాల్య వివాహాలు జరిగే ఆ రాష్ట్రంలో ఓ కుటుంబానికి చెందిన రైతుకు ఐదుగురు కుమార్తెలు జన్మించారు. వారంతా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లుగా మారి తమ తలరాతను మార్చుకున్నారు. చిన్నచూపు చూసే వారికి గట్టి హెచ్చరికను పంపారు.

దేశానికే స్పూర్తివంతంగా మారిన ఈ ఉదంతం రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. తాము అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి కారణం తమ తండ్రేనని గర్వంగా చెబుతున్నారు ఆ అమ్మాయిలు. సాధారణంగా ఒక ఇంట్లో ఎవరైనా కలెక్టర్‌ అయితే.. ఆ వీధిలో అంతా పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఒకే ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఐఏఎస్‌లుగా మారితే ఆ ఊరంతా పండగే. అలాంటి పర్వదినాన్ని సహదేవన్‌ సహరన్‌ కుటుంబం ఇప్పుడు చూస్తోంది.

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌ జిల్లాలో భేరుసరి గ్రామం ఉంది. ఈ చిన్న గ్రామానికి చెందిన సహదేవ్‌ సహరన్‌, లక్ష్మి దంపతులకు ఐదుగురూ కుమార్తెలే జన్మించారు. కొడుకు కోసం ఒకరి తర్వాత ఒకరిని కన్నారు. అయితే, అందరూ ఆడపిల్లలే పుట్టారు. వారికి వరుసగా రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్ అని తల్లిదండ్రులు పేర్లు పెట్టారు. వీరి తల్లి లక్ష్మి నిరక్షరాస్యురాలు. తండ్రి సహదేవ్‌ సహరన్‌ రైతు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా ఎంత కష్టపడినా ఫలితం ఉండేది కాదు.

ఎలా సాధించారు ?

పేదరికం కారణంగా తన కుమార్తెల చదువుకు ఆటంకం కలగకూడదని భావించిన ఆయన.. ఇంట్లోనే వారికి మంచి చదువులు అబ్బేలా ప్రోత్సహించాడు. తనకు కలెక్టర్‌ కావాలని కల ఉండేదని కుమార్తెలకు చెప్పేవాడు. దీంతో ఈ కలను నెరవేర్చడానికి కుమార్తెలందరూ కష్టపడి చదివారు. 2010లో రోమా తన కుటుంబంలో మొదటి RAS (Rajastan Administrative Service) అధికారిగా అయ్యారు. తర్వాత 2017లో మంజు కూడా పరీక్షలో పాస్‌ అయ్యింది. తర్వాత ఇదే స్పూర్తితో మిగతా ముగ్గురు కూడా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు సిద్ధమయ్యారు. తండ్రి కష్టాన్ని వృధా కానివ్వని ఈ ఐదుగురు అక్కచెల్లెళ్లు.. పట్టుదలతో కలెక్టర్లుగా అయ్యారు. వీరిపై గ్రామస్తులతో పాటు దేశ వ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

also read :

H3N2 Virus : ఏడు రోజులైనా జ్వరం, దగ్గు తగ్గడం లేదా? ఐసీఎంఆర్ కీలక హెచ్చరిక!

-Advertisement-

Women’s Day 2023 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Naveen Murder Case : నవీన్ హత్య కేసులో కీలక పరిణామం.. జైలుకు ప్రియురాలు నిహారిక!

Medaram jathara : సమ్మక్క సారక్కలు ఎవరు ? మేడారం జాతర విశేషాలు తెలుసుకోండి

Health Tips in telugu : ఈ 10 ఆరోగ్య చిట్కాలు మీ కోసం (07-03-2023)

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News