వ్యాపారం అంటే ఇదే!! టైమింగ్ అంటే ఇదే!! ఓ వైపు ట్విట్టర్ కంపెనీ వినియోగదారులకు బ్లూ టిక్ ఇవ్వడానికి నెలవారీ ఛార్జీ వసూలు చేయాలని యోచిస్తుంటే..మరోవైపు koo యాప్ ఇంగ్లీషు మాట్లాడే యూజర్స్ ను పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది. యూజర్స్ అందరికి గ్రీన్ టిక్ ఫ్రీగా ఇస్తామని చెబుతోంది.
నెలవారీ చార్జీలు, ట్విట్టర్ కొత్త రూల్స్ తో విసిగి వేసారిన వాళ్ళను, ప్రత్యేకించి ఇంగ్లీషు మాట్లాడే యూజర్స్ ను తన వినియోగదారులుగా మార్చుకునే మార్కెటింగ్ వ్యూహాలను koo అమలు చేస్తోంది.
పేమెంట్ అక్కర్లే..
వినియోగదారుల తమ ఐడెంటిటీ ని ధృవీకరణ చేసుకోవడానికి , వెరిఫికేషన్ టిక్ పొందడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని koo సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదా వక్త అంటున్నారు. తాము అలాంటి చార్జీలు యూజర్స్ నుంచి వసూలు చేయబోమని హామీ ఇస్తున్నారు. భవిష్యత్ లోనూ తమ koo యాప్ లో ఉచితంగానే గ్రీన్ టిక్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. సెలిబ్రిటీలకు ఎల్లో టిక్ ఇష్యూ చేస్తామని ఆయన వెల్లడించారు. 2023 డిసెంబరు లోగా తమ యాప్ డౌన్ లోడ్స్ 10 కోట్లు దాటుతాయని అంటున్నారు. ఆ తర్వాతే యాప్ మానిటైజేషన్ ను ఆన్ చేస్తామని వివరించారు.
Mastodon కు మస్తు లాభం..
ట్విట్టర్ లో చోటుచేసుకుంటున్న ప్రతికూల పరిణామాలతో koo యాప్ ఒక్కటే కాదు..మరో యాప్ కూడా లబ్ది పొందుతోంది. దానిపేరే మస్టడాన్ (Mastodon). గత కొన్ని వారాల వ్యవధిలోనే దీనికి లక్షలాదిగా కొత్త యూజర్స్ వచ్చారు. Mastodon ప్రత్యేకత ఏమిటంటే..అది ఇతర సోషల్ మీడియాల కంటే విభిన్నమైనది. దాదాపు ఇది క్రిప్టో కరెన్సీ లాంటిది. దీనికి ఓనర్ ఎవరూ లేరు. ఓపెన్ సోర్స్ సోషల్ మీడియా నెట్ వర్క్ ఇది. ఇందులో సభ్యులుగా చేరేవారు సెన్సార్ లేని స్వేచ్ఛతో భావ ప్రకటన చేయొచ్చు.
also read these news:
horoscope : 9-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకోండి
మీ పిల్లల ముందు ఇవి మాట్లాడుతున్నారా? అయితే జాగ్రత్త