Wife house arrest for 11 years: ఏపీలో ఓ న్యాయవాది అరాచకం వెలుగుచూసింది. తన వద్దకు వచ్చిన క్లయింట్లకు న్యాయం చేయాల్సిన న్యాయవాది.. సొంత భార్యను 11 ఏళ్లుగా హింసకు గురి చేస్తున్నాడు. బయటి ప్రపంచానికి చూపకుండా దాస్యశృంఖలాల మధ్య నలిగిపోయేలా చేశాడు. భార్యను ఆమె తల్లిదండ్రులకు కూడా చూపకుండా ఇన్నేళ్లూ మ్యానేజ్ చేస్తూ వచ్చాడు. ఆఖరికి తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదో అనే అనుమానం తల్లిదండ్రులకు ఏర్పడింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ దీపికను కలిసి బాధిత తల్లిదండ్రులు గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయవాది ఇంటికి వెళ్లిన పోలీసులపైనా ధిక్కారస్వరం వినిపించాడు సదరు న్యాయవాది. పోలీసులపైనే కేసు పెడతానంటూ బెదిరించాడు. చివరకు పోలీసులు చేసేది లేక మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన వారెంట్‌తో వెళ్లి గృహ నిర్బంధంలో ఉన్న బాధితురాలిని విడిపించి ఆమెకు స్వేచ్ఛా వాయువులు కల్పించారు.
విజయనగరం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో మార్వాడి వీధిలో న్యాయవాది గోదారి మధుసూదనరావు నివాసం ఉంటున్నాడు. ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో పెళ్లి చేసుకున్నాడు. 2009లో వీరికి ఓ కుమార్తె పుట్టింది. పెళ్లి తర్వాత మధుసూదనరావు టార్చర్ పెరిగిపోవడంతో కాన్పు కోసం వెళ్లిన సాయిసుప్రియ ఇక భర్త వద్దకు వెళ్లేది లేదని చెప్పింది. దీంతో నువ్వు లేకపోతే నేను బతకలేనంటూ ఆమె వద్దకు వచ్చి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. తర్వాత విజయనగరం వచ్చింది.
నాటి నుంచి భర్త భార్యను ఇంట్లోనే బంధించాడు మధుసూదనరావు. అమ్మానాన్నలతో మాట్లాడటానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు. కనీసం వారిని చూడటానికి కూడా అనుమతి లేదని పెత్తనం చెలాయించాడు. కుమార్తెను చూడాలని ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా కనికరించలేదు. ఇలా ఈ వ్యవహారం 11 ఏళ్లు గడిచింది. ఆఖరికి పోలీసులను ఆశ్రయించడంతో వారు వెళ్లారు. అయితే, పోలీసులనూ భయపెట్టాలని మధుసూదనరావు చూశాడు. తర్వాత ఎస్పీ వద్దకు, అనంతరం మెజిస్ట్రేట్ వద్దకు ఈ వ్యవహారం చేరింది. ప్రస్తుతం ఆమెకు విముక్తి కలిగింది.
also read :
Nagaland: 60 ఏళ్ల చరిత్రలో రికార్డు.. నాగాలాండ్‌లో అసెంబ్లీకి మహిళలు..
MLC Kavitha : అరెస్టుపై కవిత కౌంటర్.. లిక్కర్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు!
Bala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూనకాలే..!
sobhita dhulipala : అందంగా లేనని వద్దన్నారు.. కానీ ఇప్పుడు..శోభిత కామెంట్స్