Telugu Flash News

child anger : పిల్లల్లో కోపం ఎందుకు వస్తుంది ? తల్లిదండ్రులు ఏం చేయాలి?

child anger

child anger

child anger : కోపం వచ్చినప్పుడు నిశ్శబ్ధంగా కూర్చునే పిల్లలే కాదు, వాటిని పగలగొట్టి, తలలు బాదుకుంటూ బయటకి వ్యక్తపరిచే వారు కూడా ఉంటారు. మరి అలాంటి వారిని ఎలా అదుపు చేయాలో చూద్దాం..

పిల్లలకు సమస్యలు ఏమి ఉండవు అని అనుకోవద్దు. వారి స్థాయిలో వారికి ఉండవచ్చు. ఇంటి పరిస్థితులు మరియు తమకు నచ్చని పనులు చేయమని బలవంతం చేయడం వల్ల కలిగే బాధ వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ముందుగా కారణాన్ని తెలుసుకుని వారిని దగ్గరికి తీసుకోండి. వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి.

అనుకున్నవి జరగకపోవడం, ఇతరులతో పోల్చడం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల పిల్లల్లో కోపానికి గురవుతారు. అందువల్ల, ఇటువంటి పరిస్థితులు తరచుగా సంభవిస్తే, మీరు వాటిపై దృష్టి పెట్టాలి మరియు వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి.

అలాకాకుండా అలాగే అడ్జస్ట్ అవుతాడు లే అని లేదా అప్పటికపుడు సంతృప్తి పరచడమో చేస్తే దీర్ఘకాలంలో మరింత సమస్య కావచ్చు . పిల్లలు ఎక్కువగా కోపం తెచ్చుకోవడానికి కారణం మీరు చేసే గారాబం మరియు నలుగురి మధ్య తక్కువగా కలవడం. ప్రేమను కురిపించేటప్పుడు క్రమశిక్షణతో ఉండండి. పార్కులకు, వయసులో ఉన్న పిల్లల ఇళ్లకు తీసుకెళ్తే.. తోటి పిల్లల స్నేహం వల్ల వారిలో క్రమంగా మార్పు కనిపిస్తుంది.

also read :

Vitamin D : విట‌మిన్ డి లోపం రాకుండా ఏం చేయాలి? తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి ?

Mutton Canteen : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 12 న తెలంగాణ మటన్‌ క్యాంటీన్‌ ప్రారంభం

sunflower seeds benefits : పొద్దు తిరుగుడు గింజలు.. అమేజింగ్ లాభాలు..

 

Exit mobile version