ఎండా కాలంలో విరివిగా లబించే అద్భుతమైన పండు ఐస్ యాపిల్ (Ice apple) . అంటే తాటి ముంజలు. ఐస్ యాపిల్‌ను నంగు, తడ్గోలా అని కూడా చాలా ప్రాంతాల్లో పిలుస్తారు. జ్యూసీగా తియ్యగా ఉండే తాటి ముంజలు వేసవి కాలంలో ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయి.
1. ఇది దాహాన్ని తీర్చడమే కాదు అద్భుతమైన రుచిని అదిస్తుంది.
2. ఐస్ యాపిల్స్‌లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ కాల్షియం, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు విరివిగా ఉంటాయి.
3. పోషకాలతో నిండిన అద్భుతమైన పండు ఇది. తాటిపండు వేసవిలో ఉత్తమమైందిగా చెబుతారు.
4. తాటి ముంజలు తింటే శరీరం చల్లబడుతుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఈ వేసవిలో తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా మేలు చేస్తుంది.
5. కడుపు సమస్యలన్నింటికీ తాటి ముంజలు చక్కటి పరిష్కారం. ఆరోగ్యాన్ని మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.
6. డయాబెటిక్ రోగులు కూడా ఎటువంటి భయం లేకుండా ఐస్ యాపిల్స్ తినొచ్చు.
7. ఇందులోని పోషకాల కారణంగా ఆరోగ్యకరమైన బలమైన రోగనిరోధక వ్యవస్థని అందిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, సీ, బీ7 పుష్కలంగా ఉన్నాయి.
Also read :
TSPSC paper leak : పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్ డిమాండ్
Viral Video : ఇదేందయ్యా ఇదీ.. ఎండిపోయిన చేపపై నీరు పోయగానే బతికేసింది!