Weather Today : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం (24-04-2023) ఎలా ఉందో తెలుసుకోండి..
1. కొన్నాళ్లుగా భగభగ మండే భానుడి ధాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
2. ఎండ వేడిమిని భరించలేక అనేక మూగ జీవాలు కూడా మృత్యువాత పడ్డాయి.
3. వృద్ధులు వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.
4. ఉక్కపోతతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ తీపికబురు వెల్లడించింది.
5. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.
6. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
7. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని వివరించారు.
8. మరోవైపు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.
9. పంటలు కోతకు వచ్చిన దశలో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
10. మరోవైపు రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.
also read :
Gold Rates Today : ఈరోజు బంగారం, వెండి ధరలు (24-04-2023)
Horoscope (24-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?