Weather Today: బంగాళాఖాతంలోని వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం తెలంగాణ, ఏపీపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడా కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని, వేడి గాలులు పెరుగుతాయన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే చాన్స్ ఉందన్నారు.
మరోవైపు ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోనూ పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల దాకా పెరిగే చాన్స్ ఉందన్నారు. వేడి గాలులు మరింత పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE
Read Also : dehydration : డీహైడ్రేషన్‌తో చాలా డేంజర్.. ఎంత నష్టమంటే..!