Weather Today: తెలుగు రాష్ట్రాల్లో తుపాను ప్రభావంతో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా పంటలు పెద్ద ఎత్తున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దెబ్తిన్నాయి. మరోవైపు ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మే 10 నాటికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది ఉత్తర వాయువ్య దిశగా ఈనెల 11 వరకు కదిలి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు వెళ్తుందని అధికారులు వెల్లడించారు.
ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో నిన్న పలు చోట్ల వానలు పడ్డాయి. భారీ వర్షం నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
అగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీలో వాతావరణం ఇవాళ పొడిగా ఉండే చాన్స్ ఉంది. రేపటి నుంచి ఎండలు పెరగనున్నాయి.
Read Also : Horoscope Today: 10-05-2023 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు