Weather Today : తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. దీనిపై వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేటి నుంచి 10వ తేదీ దాకా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
పలు జిల్లాలకు ఇవాళ, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి వెదర్ బులెటిన్ విడుదలైంది. ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం పడే చాన్స్ ఉంది.
మరోవైపు రేపు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి. నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను ముప్పు రాష్ట్రంపై పడే చాన్స్ ఉందని, దాంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 11వ తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. ఇక ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో మోచా తుపాను ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : Horoscope (08-05-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?