Weather Today : మండు వేసవిలోనూ తెలంగాణలో కొన్ని రోజులుగా వెదర్ చల్లగా ఉంది. రోజూ సాయంకాలానికి వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల కిందటే కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. నేడు కూడా నగరంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
నగరంలోని ఎల్బీనగర్ నుంచి మొదలుకొని కోఠి, అసెంబ్లీ, పంజాగుట్ట, అమీర్ పేట్, యూసఫ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ , కూకట్ పల్లి, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారు వర్షం దాటికి ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. మరోవైపు రానున్న నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వడగండ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపారు. నేడు 15 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాటిలో సూర్యపేట, మహబూబ్‌నగర్, యాదాద్రి భవనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్ ఉన్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం చల్లగానే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ సరిహద్దులోని యానాం పరిసర ప్రాంతాలు, రాయలసీమలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేశారు.
మే 2వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాలకుక ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE