HomeweatherWeather Today (22-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Weather Today (22-05-2023): తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

Telugu Flash News

Weather Today: తెలుగు రాష్ట్రాల్లో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. పశ్చిమ బిహార్‌ నుంచి ఉత్తర తెలంగాణ దాకా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉంది.

ఏపీలోని కోస్తాంధ్రలో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా పొడి వాతావరణమే ఉండనుందని అమరావతి వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

Read Also : today horoscope in telugu : 22-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News