Weather Today: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేడి గాలుల ప్రభావం కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే చాన్స్ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల వరకు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు.
20న అంటే రేపు తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని, ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతాయని తెలిపారు.
అటు దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని, ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సాధారణంగా కంటే 4 డిగ్రీల వరకు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
Read Also : today horoscope in telugu : 19-05-2023 ఈ రోజు రాశి ఫలాలు