Weather Today : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 9వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రేపటి వరకు కోస్తాంధ్ర, తర్వాత రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతానికి తుపాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, వడగాడ్పులు తప్పవని హెచ్చరించింది.
ఇక తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి బంగాళాఖాతంలోకి వెళ్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని విశాఖపట్నంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఏపీలోని పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జల్లులు పడవచ్చని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో కొన్ని చోట్ల వడగండ్ల వాన కురుస్తుందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE