Weather Today : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. వారం రోజులుగా సాయంత్రం అయ్యేసరికి వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అకాల వర్షం ధాటికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు.
రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మూడు రోజుల పాటు కుమ్రంభీం, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
కొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు.
పశ్చిమగోదావరి జిల్లా, నంద్యాల, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురిశాయి. మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, సీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
also read :
NTR: బాలయ్యని పక్కన పెట్టి ఎన్టీఆర్‌కి ప్రత్యేక గౌరవం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం