Weather Today: దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాడ్పుల తాకిడి పెరిగిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణ, ఏపీలో మోచా తుపాను ప్రభావంతో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.
ఇటీవల వారం పది రోజులపాటు కురిసిన అకాల వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. రానున్న రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఒడిశాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వచ్చే ఐదు రోజుల్లో వేడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మే 13-14 వరకు కేరళ, తమిళనాడులలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని పేర్కొన్నారు.
ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు ఎయిర్ కండిషనర్లు, ఇతర వాటర్ కూలింగ్ పరికరాలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు విద్యుత్ డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని జోన్లు మినహా, దేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల దాకా పెరిగే చాన్స్ ఉంది. మరోవైపు ఏపీలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
Read Also : horoscope today telugu : 13-05-2023 శనివారం ఈ రోజు రాశి ఫలాలు