Weather report : హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక ! తెలంగాణ రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలతో పాటు రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, రాజన్న హైదరాబాద్, సిద్దమరిరెడ్డి. పేట, వికారాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
సోమవారం నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించింది. దీంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రయాణాలు, పనులు చేసుకోవాలని వెల్లడించారు. వాతావరణ శాఖ వర్ష సూచనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
read more :
Ganja Smuggling : గంజాయి రవాణా చేస్తున్న మహిళల అరెస్టు🚔
Shakambari : ఆ దర్శనం అనిర్వచనీయం.. శాకంబరిగా భద్రకాళి అమ్మవారు