HomelifestyleWater : వాటర్‌ బాటిల్‌ కాస్ట్‌ రూ.50 లక్షలు.. ఏమిటంత ప్రత్యేకత?

Water : వాటర్‌ బాటిల్‌ కాస్ట్‌ రూ.50 లక్షలు.. ఏమిటంత ప్రత్యేకత?

Telugu Flash News

Water bottle cost : సాధారణంగా వాటర్‌ బాటిల్‌ ధర రూ.20 ఉంటుంది. ఇందులో కాస్ట్‌లీవి కూడా ఉంటాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ తాగే వాటర్‌ బాటిల్‌ ధర లీటర్‌ సుమారు రూ.600పైనే ఉంటుంది. ఇలా ఇందులో రకరకాలు ఉంటాయి.

అలాగే వేలల్లో ఉన్న వాటర్‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. కానీ లక్షల ఖరీదు చేసే వాటర్‌ బాటిల్‌ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ ధర అక్షరాల 50 లక్షల రూపాయలు.

ఆ వాటర్ బాటిల్ మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఈ బాటిల్ 2010లోని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం విశేషం. ఇప్పటికీ ఈ వాటర్ బాటిల్ ని తలదన్నే ఖరీదైన నీళ్ల బాటిల్ తయారవ్వలేదు.

దీంతో ఇది మళ్ళీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. దీని పేరు ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’.  ఈ నీళ్ల బాటిల్ 750 ఎంఎల్‌ నీటిని కలిగి ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ ప్యాకేజింగ్, డిజైన్‌కే ధర మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఈ బాటిల్ 24 క్యారెట్ బంగారంతో తయారు చేశారు. ఇక లోపల ఉన్న నీటిలో ఐదు గ్రాముల బంగారం ద్రవ రూపంలో కలిసి ఉంటుంది. అది కూడా 24 క్యారెట్ల బంగారమే.

ఇందులో ఉండేది ఐస్లాండ్, ఫిజి, ఫ్రాన్స్ లోని హిమానీనదాలలో లభించే స్వచ్ఛమైన నీరట. ప్రతి బొట్టూ కష్టపడి సేకరిస్తారట. ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీరు ఇదేనని చెబుతున్నారు.

-Advertisement-

also read :

Water : మన శరీరంలో నీటి అవసరం.. నీరు ఎక్కువైనా, తక్కువైనా వచ్చే సమస్యలేంటి ?

barley water benefits : బార్లీ నీరు తాగితే బోలెడు లాభాలు..

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News