Wednesday, May 8, 2024
Homeviral newsViral Video : కదులుతున్న ట్రక్కు నుంచి మేకల దొంగతనం.. తర్వాత ఏమైందంటే..

Viral Video : కదులుతున్న ట్రక్కు నుంచి మేకల దొంగతనం.. తర్వాత ఏమైందంటే..

Telugu Flash News

Viral Video : సోషల్‌ మీడియా పుణ్యమా చోరీ చేసిన వ్యక్తులను పట్టుకోవడం ఒకరకంగా సులభమైంది. దొంగతనాలు చేసే విధానం సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలు ఇప్పుడు పోలీసులకు ప్లస్‌ పాయింట్‌గా మారాయి. తాజాగా ఓ దొంగ చేసిన పనిని వీడియో తీసిన వ్యక్తి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

అక్కడ వింత ఘటన చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ధూమ్‌ సినిమాలో చూపించినట్లుగా సీన్‌ తలపించింది. ఓ దొంగ నడుస్తున్న ట్రక్కును ఫాలో అయ్యాడు. ట్రక్కు మేకల లోడుతో వెళ్తోంది. ట్రక్కు వెనకే వెళ్లిన దొంగ.. మేకలను దొంగిలించడం సెన్సేషన్‌గా మారింది. వేగంగా వెళ్తున్న లోడు నుంచి కూడా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. అనంతరం ఓ కారు అక్కడికి చేరుకుంది.

ట్రక్కు వేగాన్ని అందుకుంటూ సేమ్‌ స్పీడుతో కారు వెళ్లింది. కదులుతున్న ట్రక్కు.. కదులుతున్న కారు.. ఆ ట్రక్కు పై నుంచి దొంగ కారుపైకి దిగేశాడు. అనంతరం బిందాస్‌గా ఇద్దరూ ఎస్కేప్‌ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ చోరీ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిందని ప్రచారం చేశారు. దీంతో ఉన్నావ్‌లోని పోలీసులు వీడియోను క్షుణ్నంగా పరిశీలించారు.

అయితే, ఆ ఘటన ఉన్నావ్‌లో జరగలేదని, మహారాష్ట్రలోని ఇగత్‌పురి-ఘోతి జాతీయ రహదారిపై జరిగిందని చెప్పారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. వీడియోను చూసిన పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కదులుతున్న ట్రక్కుపై దొంగ చేసిన సాహసాన్ని చూసి అవాక్కయ్యారు. మేకల దొంగతనం కోసం ప్రాణాలు పణంగా పెడతాడా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సేమ్‌ టు సేమ్‌ సినిమాల్లో చూపించినట్లుగా చోరీ జరిగిందని, నడుస్తున్న ట్రక్కు పై నుంచి ఎలా దిగాడని కామెంట్లు పెడుతున్నారు. ఇదంతా ధూమ్‌ మూవీ చూసి ఇన్‌స్పైర్‌ అయి ఉంటాడని కామెంట్లలో జోకులు పేల్చుతున్నారు.

also read :

-Advertisement-

Andhra Pradesh : బాలినేనికి సీఎం పిలుపు.. బుజ్జగింపులు కొనసాగుతాయా? మందలిస్తారా?

Viral Video : యువతిని నడిరోడ్డుపై లైంగికంగా వేధించబోయాడు.. అప్పుడేం జరిగిందో చూడండి!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News