HometelanganaRevanth Reddy | తెలంగాణా రెండో రాజధానిగా వరంగల్... సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్, రేపే పర్యటన

Revanth Reddy | తెలంగాణా రెండో రాజధానిగా వరంగల్… సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్, రేపే పర్యటన

Telugu Flash News

రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ మంత్రి సీతక్కతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

వరంగల్ జిల్లాకు రేవంత్ రెడ్డి… సమీక్షించిన మంత్రులు

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం కు నివేదించనున్న పలు అంశాలపై సమావేశంలో మంత్రులు అధికారులతో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వనమహోత్సవం, మహిళాశక్తి కార్యక్రమం తదితర అంశాల పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.

వరంగల్ నగరం రెండో రాజధానిగా చేసే ప్లాన్ లో రేవంత్ రెడ్డి

సీఎం పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉందని ఆమె పేర్కొన్నారు.

మాస్టర్ ప్లాన్ పై చర్చ, మామునూరు ఎయిర్ పోర్ట్ పైన కూడా

వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అంశం కూడా చర్చకు వచ్చిందని గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సొంత అజెండాతో చేసినవని అర్థమైందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మూడు నెలల కాల వ్యవధి పెట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసే అంశం ఉంటుందని కొండా సురేఖ పేర్కొన్నారు. అలాగే మామునూరు ఎయిర్పోర్ట్ అంశం కూడా రేపు సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు, ఇన్నర్ రింగ్ రోడ్ పనులపై సీఎం సమీక్ష

రేపు మహిళా శక్తి రుణాలను 20 కోట్ల రూపాయల మేర మహిళలకు ఇవ్వనున్నారని తెలిపారు. వరంగల్ కార్పొరేషన్ కి కొత్త బిల్డింగ్ ఏర్పాటు ప్రతిపాదనలు కూడా సీఎం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు, ఆసుపత్రిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నదానిపైన సీఎం పరిశీలన జరుపుతారని, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, దాని సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News