Saturday, May 11, 2024
HomecinemaWaltair Veerayya movie review : 'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ

Waltair Veerayya movie review : ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ

Telugu Flash News

Waltair Veerayya movie review :  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అయింది.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై మొద‌టి నుండి భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ని చూస్తారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది .ట్రైలర్, సాంగ్స్ కూడా చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే అంచనాలు పెంచాయి. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.

Waltair Veerayya movie Rating : 3/5

క‌థ‌:

అంతర్జాతీయ మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌గా, ఆ డ్రగ్ కేసును పోలీసు అధికారి (రాజేంద్ర ప్రసాద్) దర్యాప్తు చేపడుతారు. వాల్తేరులో వీరయ్య (చిరంజీవి) దర్యాప్తుకు సహకరించడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ అతిథి (శృతిహాసన్) వీరయ్యతో పరిచయం ఏర్పడుతుంది. ఆ స‌మ‌యంలో ల‌వ్ ప‌డుతుంది. అయితే మలేషియాలో డ్రగ్స్ దందాకు వీరయ్యకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఏసీపీ (రవితేజ)కి, వీరయ్యకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులకు దారి తీసింది అనే ప్రశ్నలకు సమాధానం వాల్తేరు వీరయ్య సినిమా చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్

Waltair Veerayya movie reviewమెగాస్టార్ చిరంజీవి ప‌ర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాల్తేరు వీరయ్య సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. శృతిహాసన్ గ్లామర్ పరంగాను, పాటల్లో స్టెప్పులతో ఆలరించింది. చిరంజీవి ఇంట్రో సీన్ అదరిపోయింది. బీజీఎం అయితే ఇంకా అదిరింది… చిరంజీవి మాస్ లుక్స్ తో సూపర్ అనిపించాడు.ఇంటర్వెల్ వరకు ఈ చిత్రం అక్కడడక్కడ కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ సన్నివేశాలతో బాగానే న‌డిపించాడు బాబీ. దేవి బాణీలు అదిరిపోయాయి. ఒక‌టిని మించి మ‌రొక‌టి అనేలా ఉంది. ఇక నిర్మాణ విలువ‌లు, ఎడిటింగ్ తో పాటు ఇతర సాంకేతిక వాల్యూస్ కూడా బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్
కామెడీ
డ్యాన్స్
ఇంట‌ర్వెల్ ఎపిసోడ్

మైన‌స్ పాయింట్స్

సాగ‌దీత సన్నివేశాలు

-Advertisement-

ఫైన‌ల్‌గా…

ఇంటర్వెల్ వరకు ఈ చిత్రం అక్కడడక్కడ కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ సన్నివేశాలతో సాగిన ఇంటర్వెల్ బ్లాక్ లోనే పూనకాలు లోడింగ్ మూమెంట్ వస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చారు. ఆయన లుక్స్, మ్యానరిజమ్స్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి. చిరంజీవి, రవితేజని సింగిల్ ఫ్రేమ్ లో చూడడం మాస్ ఆడియన్స్ కి పండగే. కథలో ఆసక్తికర ఎలిమెంట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంటాయి. కామెడీ మాత్రం అన్నిసార్లు వర్క్ కాలేద‌ని చెప్పాలి. మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం పండ‌గ వినోదం త‌ప్ప‌క ఇస్తుంద‌నే చెప్పాలి.

Also Read: 

Horoscope Today Telugu : 13-01-2023 శుక్రవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

shruti haasan latest instagram photos 2023

Viral video : విమానంలో ప్రియురాలికి సర్‌ప్రైజ్‌.. ఎలా ప్రపోజ్‌ చేశాడో చూడండి!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News

ఇంటర్వెల్ వరకు ఈ చిత్రం అక్కడడక్కడ కొన్ని మాస్ ఎలిమెంట్స్ తో, కామెడీ సన్నివేశాలతో సాగిన ఇంటర్వెల్ బ్లాక్ లోనే పూనకాలు లోడింగ్ మూమెంట్ వస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి మంచి హై ఇచ్చారు. ఆయన లుక్స్, మ్యానరిజమ్స్ వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేస్తున్నాయి. చిరంజీవి, రవితేజని సింగిల్ ఫ్రేమ్ లో చూడడం మాస్ ఆడియన్స్ కి పండగే.Waltair Veerayya movie review : 'వాల్తేరు వీరయ్య' మూవీ రివ్యూ