HomesportsVirat Kohli: ఇదేందో విచిత్రంగా ఉందిగా.. కోహ్లీ రెండు సెంచ‌రీలు రాహుల్ కెప్టెన్సీలోనే, అది కూడా సిక్స్‌తో...!

Virat Kohli: ఇదేందో విచిత్రంగా ఉందిగా.. కోహ్లీ రెండు సెంచ‌రీలు రాహుల్ కెప్టెన్సీలోనే, అది కూడా సిక్స్‌తో…!

Telugu Flash News

Virat Kohli: శ‌నివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వ‌న్డేలో ఇషాన్ కిష‌న్, విరాట్ కోహ్లీ చెల‌రేగి ఆడ‌డంతో భార‌త్ నాలుగు వంద‌ల పైచిలుకు ప‌రుగులు సాధించింది. అయితే బంగ్లా క‌నీసం 200 ప‌రుగులు కూడా చేయ‌లేక కుప్ప‌కూలింది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు వన్డే ఫార్మాట్‌లో సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. 1214 రోజుల తర్వాత వన్డే ఫార్మాట్‌లో విరాట్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113) మూడెంకల స్కోర్‌ను అందుకోవ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. . 2019లో వెస్టిండీస్‌‌పై చివరిసారిగా వన్డే శతకాన్ని అందుకున్న కోహ్లీ.. మళ్లీ ఇన్నాళ్లకు మ‌రో సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 72వ సెంచరీ నమోదు చేసిన కింగ్ కోహ్లీ.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(71)ను అధిగమించాడు.

బంగ్లాదేశ్‌తో 2019లో డేనైట్ టెస్ట్ మ్యాచ్‌లో 70వ సెంచరీ అందుకున్న విరాట్.. 71వ సెంచరీకి మూడేళ్ల సమయం తీసుకున్నాడు. ఆసియా కప్‌ 2022 ముందు వరకు నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్.. ఆసియాకప్ నుండి ఫామ్‌లోకి వ‌చ్చాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్న కోహ్లీ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోను అద‌ర‌గొట్టాడు. అయితే రీసెంట్‌గా బంగ్లాతో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమయిన కోహ్లీ నామమాత్రపు మూడో వన్డేలో ఎబాదత్ హోస్సెన్ బౌలింగ్‌లో సిక్స్ బాది వన్డే సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. కాకతాళీయమో ఏమో కానీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే 71, 72వ సెంచరీలు బాదిన కోహ్లీ.. ఈ రెండు శతకాలను సిక్సర్లతో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ గణంకాలు కోహ్లీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

ఆసియాకప్‌లో అఫ్గాన్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉండగా.. రాహుల్ జట్టును నడిపించాడు. తాజా మ్యాచ్‌కు రోహిత్ బొటన వేలి గాయంతో దూరం కావ‌డంతో జ‌ట్టు ప‌గ్గాలు అందుకున్నాడు రాహుల్‌. ఆయ‌న కెప్టెన్సీలో రెండు సార్లు సెంచ‌రీలు సాధించ‌డంతో ఇప్పుడు ఈ విష‌యంపై తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇక కోహ్లీ సెంచరీ అనంతరం నవ్వులు చిందిస్తూ.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌తో ఈ సెంచరీకి మూడేండ్లు పట్టిందన్నాడు. ‘three fu***ng years boys”‘అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీకి విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో బంగ్లాదేశ్ ముందు టీమిండియా 410 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News