Homeviral newsViral Video : తమ పార్టీలో డెలివరీ బాయ్ ని కూడా కలిపేసుకున్న బెంగళూరు యువకులు.. నెటిజన్ల ప్రశంసలు

Viral Video : తమ పార్టీలో డెలివరీ బాయ్ ని కూడా కలిపేసుకున్న బెంగళూరు యువకులు.. నెటిజన్ల ప్రశంసలు

Telugu Flash News

Viral Video : ఇటీవలే కాలంలో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆన్ లైన్ నుంచే తెప్పించుకుంటున్నారన్న విషయం అందరికి తెలిసిందే.అది ఆహారమైనా సరే… లేదా అవసరమయ్యే వస్తువులైనా సరే.. అలా ఆర్డర్  చేసినప్పుడు తీసుకురావడంలో కొంచెం ఆలస్యం అవుతుంది.

ఆ సమయంలో కొంతమంది డెలివరీ చేసిన వాళ్ళని వంద ప్రశ్నలు అడుగుతారు. చెడా మడా తిట్టేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే డెలివరీ బాయ్స్ గా చేసే వాళ్ళని చిన్న చూపు చూస్తారు. కానీ ఆ డెలివరీ చేసిన వ్యక్తి కూడా మనిషేననీ తనకూ ఒక జీవితం ఉంటుందనీ ఎవరూ ఆలోచించరు.

అలాంటి మనుషులున్న ఈ కాలంలో బెంగళూరుకి చెందిన కొంత మంది యువకులు ఈ ఏడాది న్యూ ఇయర్ జరుపుకుంటున్న సమయంలో ఆలస్యంగా వచ్చిన జొమాటో డెలివరీ బాయ్ ని తిట్టలేదు. పైగా అతనితో కేక్ కట్ చేయించారు.

అసలు విషయం ఏంటంటే 31 రాత్రి బెంగళూరులోని యువకులు వాళ్ళ ఇంటి టెర్రస్ పై న్యూ ఇయర్ జరుపుకుంటున్నారు. ఆ సమయంలోనే న్యూ ఇయర్ కి గంట ముందు అంటే సరిగ్గా 11 గంటలకు వచ్చేలా జొమాటోలో ఫుడ్ ఆర్డర్(order) ని పెట్టుకున్నారు. అయితే 11 గంటలకు రావాల్సిన ఆ డెలివరీ బాయ్ అనుకోని కారణాల వల్ల గంటలేటుగా సరిగ్గా 12 గంటలకి ఆ ఆర్డర్ ని తీసుకొచ్చాడు.

అయితే ఆలస్యంగా వచ్చిన డెలివరీ బాయ్ ఆ యువకులు తిట్టలేదు. అతనితో విసుగుగా కూడా మాట్లాడలేదు. వాళ్ళ సెలబ్రేషన్స్ లో డెలివరీ బాయ్ ని కలుపుకోవడమే కాక…అతనితో కేక్ కూడా కట్ చేయించారు. ఇలా చేసి నందుకు ఆ డెలివరీ బాయ్ కూడా ఎంతో సంతోషించాడు.

-Advertisement-

ఈ సంఘటనంతా చూసిన ఆ పార్టీలో ఉన్న ఒకరు వీడియో తీసి ఇంటర్ నెట్ లో పోస్ట్ చేయడం తో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి ఆ యువకులు “డిసెంబర్ 31 రాత్రి 11 గంటలకు మేం ఫుడ్ ఆర్డర్ చేశాం. ఆర్డర్ వచ్చేసరికి సరిగ్గా 12 గంటలు. అందుకే డెలివరీ ఏజెంట్‌ తో కేక్ కట్ చేశాం. అతనితోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం” అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియో చూసిన నెటి జనులు “ఇలా ఆనందాన్ని పంచుతూ ఉండండి.అది ఏదో ఒక రోజు తిరిగి మీకు వస్తుంది. మీరు చాలా మంచి పని చేశారు.” అంటూ కామెంట్లు చేస్తూ యువకులపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఆ యువకులు మంచి మనసుతో ఎంత మంచి పని చేశారో… కదా…

also read : 

AP CM JAGAN : టీడీపీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్..

India: టీమిండియాలా లేదు.. గుజ‌రాత్ జ‌ట్టులా ఉంది.. జ‌ట్టు ఎంపిక‌పై నెటిజ‌న్స్ ట్రోల్స్

weight loss tips in telugu : తొందరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News