Viral Video : జీవితంలో ప్రతి మూమెంట్‌నూ ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరుచుకోవడానికి నేటి కాలంలో చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ప్రత్యేకించి పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ కార్యక్రమాల్లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల మాదిరిగా సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. తమ స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లు జరిగే సందర్భాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇలా వీడియోలు, ఫొటోలు తీస్తున్న క్రమంలో పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? ఎక్కడ ఉన్నాం అనే విషయాలను కూడా మరిచిపోతుంటారు.
ఇదే తరహాలో ఓ మహిళ వివాహ వేడుకలో సెల్‌ఫోన్ చేతిలో పట్టుకొని అచ్చం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. ఇందులో భాగంగా ఫొటోలు, వీడియోలు తీయడంలో నిమగ్నం అయిపోయింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెలను దగ్గరగా ఫొటోలు తీయాలనే ఉత్సాహం కనబరిచింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో గమనించుకోలేకపోయింది. రోడ్డుకు చివరి భాగంలో ఉన్నాననే సోయి లేకుండా అలాగే వెనక్కు నడుచుకుంటూ వచ్చేసింది.
ఈ క్రమంలోనే పెద్ద డ్రెయినేజీ కాలువలో ఆ మహిళ టక్కున పడిపోయింది. ఈ తతంగాన్ని అంతా వెనుక నుంచి కొందరు వీడియో తీశారు. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా హైదరాబాదీ జాన్ అనే పేజీలో ఈ వీడియోను పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది. 10.5 మిలియన్ల మంది ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారు. 282k లైక్స్ వచ్చాయి. వందలాది మంది వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఫొటోలు తీయడంలో నిమగ్నమైపోవడమే కాదు.. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో కూడా గమనించాలి కదా.. అని కామెంట్ చేస్తున్నారు.
నూతన వధూవరులు బయటకు వస్తున్న క్రమంలో ఆ మహిళ వెనుక చూసుకోకుండా సెల్‌ఫోన్లో వీడియో తీస్తూ లీనమైపోయిందని, ఇలా ఎవరూ చేయకండని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లక్కీగా డ్రెయినేజీ నీళ్లు లోతుగా లేకపోవడం మంచిదైందంటున్నారు. అదే భారీ డ్రెయినేజీ అయి ఉండి లోతుగా నీరు ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు వాటిల్లి ఉండేదంటున్నారు.
also read :
Border-Gavaskar Trophy 2023: తొలి రోజు ఆస్ట్రేలియా డామినేషన్.. టపాటపా పడిపోయిన టీమిండియా వికెట్లు
Raashi Khanna Latest instagram photos, images, stills 2023
greece train accident : గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం.. అసలేం జరిగింది ?
Sreeleela : క్షమాపణలు చెప్పిన నటి శ్రీలీల.. కారణం ఏంటి?