Viral Video : సాధారణంగా బైక్ అంటే ఒక వ్యక్తి నడుపుతుంటే మరో వ్యక్తి వెనకవైపు కూర్చోవచ్చు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు కూడా కూర్చొని వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లో ట్రాఫిక్ పోలీసుల కంట పడితే ట్రాఫిక్ నియమాలు అతిక్రమించినందుకు, ట్రిపుల్ రైడింగ్ కింద చలాన్ వేసేస్తారు. అయితే, అసాధారణ సందర్భాల్లో బైక్‌పై నలుగురు లేదా అంతకంటే ఎక్కువ ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే, ఈ వీడియోలో ఏకంగా ఎనిమిది మంది ప్రయాణం చేయడం సంచలనంగా మారుతోంది. ఈ కథేంటో మీరే చూడండి..
జుగడ్ తయారీదారులు కొందరు ఓ బైక్‌ను ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. అందులో ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది జర్నీ చేసేలా తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగానే దేశీయ జుగడ్‌కు చెందిన వీడియోలను చూడడానికి నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తుంటారు. విపరీతంగా వీడియోలను షేర్ చేస్తుంటారు. దీంతో ఇలాంటి వీడియోలు కాస్త స్పెషల్‌గా ఉంటాయి. ఈ జుగడ్ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇది బైకా.. ప్యాసింజర్ రైలా అని ఆశ్చర్యపోతున్నారు.
జుగడ్ టెక్నాలజీ వాడటం అందరికీ సాధ్యం కాదు. కొందరిలో మాత్రమే ఇలాంటి ప్రతిభ దాగి ఉంటుంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు. వీరు తయారు చేసిన బైక్‌పై ఎనిమిది మంది జర్నీ చేయడం కనిపిస్తోంది. ఓ పెట్రోలు బంక్ వద్ద పెట్రోలు నింపుకొనేందకు వచ్చిన వీరిని అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. వీడియోలో ఒకరి తర్వాత ఒకరు ఏకంగా ఎనిమిది మంది ఒకే బైక్‌పై ఎక్కారు.
జుగడ్ టెక్నాలజీతో బైక్‌ను రూపాంతరం చేశారు. ఎక్కువ మంది కూర్చొనేలా తీర్చిదిద్దారు. సీటును వెనుకవైపు పొడిగించారు. దీంతో ఒక బైక్‌పై ఇద్దరికి సరిపోయే స్పేస్‌ను ఎనిమిదికి పెంచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరికొందరైతే పోలీసులకు చిక్కితే అంతే సంగతులంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఒక బైక్‌పై ఇంత మంది ప్రయాణం చేయడం నేరమని, ప్రమాదం జరిగితే ఏకంగా అందరికీ ప్రాణాపాయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోకు 11 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
also read :
Naveen Murder Case : నవీన్‌ను హత్య చేసిన రోజు హరిహర కృష్ణ ఏమేం చేశాడు? దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
MLC Kavitha : కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఉదయం నుంచి జరిగిన పరిణామాలివే..!
moral stories in telugu : గుంటనక్క గొప్పలు.. కథ చదవండి