Viral video : ప్రేమించిన యువతికి వెరైటీగా ప్రపోజ్ చేయడం అనేది యువకులకు పెద్ద టాస్క్. నేటి కాలంలో యువత లేటెస్ట్ ప్రపోజింగ్ స్టైల్స్‌ను ఫాలో కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సరికొత్తగా ప్రియురాళ్లకు ప్రేమను వ్యక్తపరచడానికి ట్రై చేస్తున్నారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో యువకుల మనసుల్లో బాగా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. తన ప్రేమను వ్యక్తపరిస్తే ఓకే చేస్తుందా? లేక నిరాకరిస్తుందా? అనే భయాందోళన యువకుల్లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో కాస్త డిఫరెంట్‌గా లవ్ ప్రపోజ్ చేసే వారి సంఖ్య పెరిగింది.
ఇలాంటిదే ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసేందుకు వెరైటీగా ప్లాన్ చేశాడో యువకుడు. ఇందుకు విమాన ప్రయాణాన్ని వేదిక చేసుకున్నాడు. ఈ నెల 2వ తేదీన ముంబైకి వెళ్తున్న విమానంలో ఓ యువతి ప్రయాణించింది. ఎయిర్ ఇండియా సర్వీసులో టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలుసుకున్న ఆమె ప్రియుడు.. ఇదే విమానంలో ఆమెకు తెలియకుండా టికెట్ బుక్ చేసుకున్నాడు. సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు.
దీని కోసం విమానంలోని సిబ్బందితో ముందే మాట్లాడుకున్నాడు. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ చార్ట్ తీసుకొని ఆమె కూర్చున్న సీటు వద్దకు చేరుకున్నాడు. ఎక్స్‌క్యూజ్‌మీ మ్యామ్.. అంటూ చార్ట్ చూపించాడు. ఈ సమయంలో యువతి ఆశ్చర్యపోయింది. ఎవరా అని చూసింది. ఈ సందర్బంలోనే అతడు ఫేస్‌కు ఉన్న మాస్క్ తీసేశాడు. దీంతో ఆ యువతి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
పొంగిపోయిన యువతి..
వెంటనే ప్రియుడి వద్దకు వచ్చింది. ఆమె వచ్చేటప్పుడే ముందే తెచ్చుకున్న ఓ రింగ్‌ను ప్రియుడు ఆమెకు ఇస్తూ ప్రపోజ్ చేశాడు. తాను జీవితాంతం నీతో కలిసి జీవించాలనుకుంటున్నానని, అందుకు సమ్మతిస్తావా చెలియా.. అంటూ చార్ట్‌ను చూపించాడు. ఇందుకు యువతి పొంగిపోయింది. వెంటనే అతడిని హత్తుకొని బుగ్గకు ముద్దు పెట్టి ప్రేమను అంగీకరించింది. ఫ్లైట్‌లో వెళ్తున్న మరో ప్రయాణికుడు ఇదంతా వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది. గ్రేట్ ప్రపోజల్ అంటూ నెటిజన్లు ఆ యువకుడిని మెచ్చుకుంటున్నారు.
हवा में परवान चढ़ा प्यार… शख़्स ने अपनी मंगेतर को फ़्लाइट में किया प्रपोज़, एयर इंडिया ने की मदद. #propose #fiancee #AirIndia pic.twitter.com/bYsy5KILTF
— Shivaji Dubey (@Shivaji_Dube) January 12, 2023
Also Read news :
Kukkuta Sastram : పందెం కోడి పుంజులకూ జ్యోతిష్యం.. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏం చేస్తారంటే!
Somesh Kumar with CM Jagan : వైఎస్ జగన్‌తో సోమేష్ కుమార్ భేటీ.. తుది నిర్ణయం ఏంటంటే!