Homeandhra pradeshKukkuta Sastram : పందెం కోడి పుంజులకూ జ్యోతిష్యం.. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏం చేస్తారంటే!

Kukkuta Sastram : పందెం కోడి పుంజులకూ జ్యోతిష్యం.. కుక్కుట శాస్త్రం ప్రకారం ఏం చేస్తారంటే!

Telugu Flash News

Kukkuta Sastram : సంక్రాంతి రానే వచ్చేసింది. పండుగ కన్నా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడి పందాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఏకంగా ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందులో పాల్గొని ప్రారంభిస్తుంటారు. కోర్టులు హెచ్చరించినా నిర్వాహకులు పెడచెవిన పెడుతుంటారు. పందెం బరిలో నిలిచే కోడి పుంజులను ప్రత్యేకంగా పెంచుతారు. వేలాది రూపాయల విలువ జేసే ప్రత్యేక ఆహారం, పందెంలో గెలవడానికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది.

అయితే, పందెంలో గెలవాలంటే కోడి పుంజు శారీరక దారుఢ్యం, పందెం మెళకువలతో పాటు.. జ్యోతిష్య శాస్త్రం కూడా కీలక భూమిక పోషిస్తుందంటున్నారు కోళ్ల పెంపకందారులు. మనుషులకే కాదు.. కోడిపుంజులకు కూడా జ్యోతిష్యం ఉంటుందా? అంటూ చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ పందెం కోడి పుంజుల విషయంలో కుక్కట శాస్త్రం అనేది పేరుగాంచింది.

Kukkuta Sastramమనుషులకు ఎలాగైతే పుట్టిన తేదీ, జన్మనక్షత్రం ప్రకారం జ్యోతిష్యులు జాతకం చూస్తారో పందెం కోళ్లకు కూడా ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. ఇందులో కోడి జన్మించిన తేదీ, సమయం, నక్షత్రం కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. పందెంలో గెలవాలంటే దాని జాతకం, బరిలో నిలిచిన దిశ కూడా ముఖ్యమేనని పందెం కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. సుమారు ఏడు నుంచి పది నెలల పాటు పందెం కోసం బలమైన ఆహారం ఇచ్చి కోళ్లను పెంచుతారు. ఒక్కో కోడి సుమారు 70 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

నక్షత్రాన్ని బట్టి గెలుపు అంచనా..

బరిలో నిలిచే కోళ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం సందర్భంగా సుమారు 30 రకాల కోడి పుంజులు బరిలో ఉంటాయని చెబుతున్నారు. కోళ్ల రంగును బట్టి ఈ రకాలను విభజిస్తారు. దీంతోపాటు పందెం కోళ్లకు కుక్కుట శాస్త్రం ప్రకారం రంగును బట్టి, రకాన్ని బట్టి బరిలో దింపే ఆచారం కొనసాగుతోందని పెంపకందారులు, కోళ్ల పందాల నిర్వాహకులు చెబుతున్నారు. ఏడాదికోసారి వచ్చే ఈ జాతర చాలా మందికి ఉపాధి కల్పిస్తోందంటున్నారు. ఐపీఎల్‌ రేంజ్‌లో బెట్టింగులు కూడా ఉంటాయి. దాంతోపాటు జూదానికి సంబంధించిన ఇతర ఆటలు కూడా అక్కడ యథేచ్చగా కొనసాగుతాయి. కుక్కుట శాస్త్రం ప్రకారం కోళ్లకు 27 జన్మ నక్షత్రాలు ఉంటాయంటున్నారు.

also read:

Crimea : రష్యా ఉక్రెయిన్ యుధ్ధంలో ‘క్రిమియా’ కు ఎందుకింత ప్రాధాన్యత?

-Advertisement-

Rishabh Pant: రిష‌బ్ పంత్ ఆరోగ్యం ఎలా ఉంది..ఐపీఎల్‌లో ఆడ‌తాడా లేదా అనే దానిపై అప్‌డేట్ ఇచ్చిన గంగూలీ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News