Telugu Flash News

Viral Video : పనివాళ్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. యజమాని ఏం చేశాడంటే..!

viral videos

Viral Video : సాధారణంగా పండుగలు, శుభకార్యాలు, బర్త్‌డేల సందర్భంగా తమ వద్ద పని చేసే సిబ్బందికి స్వీట్లు, బట్టలు పెడుతుంటారు యజమానులు. దసరా పండుగ వస్తే బోనస్‌లు ఇవ్వడం, స్వీట్‌ బాక్స్‌లు పంచడం ఆనవాయితీ. మరికొందరు యజమానులైతే డబ్బులు కూడా ఇస్తుంటారు. సంస్థ అభివృద్ధికి, తమ కోసం కష్టపడి పని చేసినందుకు ఉదారత చాటుతుంటారు కొందరు యజమానులు.

కానుకల రూపంలో ఉద్యోగులకు మేలు చేకూరుస్తుంటారు. మొన్న ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఓ బంగారం వ్యాపారి ఉద్యోగులందరికీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటన అందరూ చూశారు. అయితే, మలేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించింది. సిబ్బందికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

పండుగ సందర్భంగా తన ఇంట్లో పనిసే ముగ్గురు మహిళలకు భారీగా బోనస్‌ ఇచ్చింది. యజమాని తమపై చూపిన ఔదార్యానికి సిబ్బంది అవాక్కయ్యారు. పండుగ నేపథ్యంలో తన ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు మహిళలకు సర్‌ప్రైజ్‌ ఇవ్వడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. మలేషియాలో మహిళా వ్యాపార వేత్త అయిన ఫరా వెన్‌.. తన ఇంట్లో పని చేసే మహిళలకు పండగ గిఫ్ట్‌ ఇచ్చింది.

ఇందులో భాగంగా కవర్లను అందించింది. తీరా అవి ఓపెన్‌ చేసి చూడగానే వారు ఎగిరి గంతేసినంత పని చేశారు. చూడగానే అనోట మాట రాలేదు. యజమాని వారికి ఇచ్చిన కవర్లలో ఒక్కొక్కరికి 10 వేల రింగిట్స్‌ ఉన్నాయి. రింగిట్స్‌ అంటే మలేషియా కరెన్సీ. అంటే మన ఇండియన్‌ కరెన్సీ ప్రకారం 1.80 లక్షల రూపాయలన్న మాట. దీంతో అవి చూసిన వారు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

దీంతో పాటు ఓ మూడు రోజుల హాలిడే ట్రిప్‌ కింద ఓ ద్వీపానికి వెళ్లి రావాలంటే టికెట్లను కూడా బుక్‌ చేసింది ఆ యజమాని. టికెట్‌తో పాటు ముగ్గురి ప్రయాణాలకు చార్టర్డ్‌ హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. లగ్జరీతో కూడిన హోటల్‌ సదుపాయం కూడా వీరికి కల్పించింది. ఇలా పని వాళ్ల కోసం ఇంత చేయడంతో ఆ యజమానిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వీడియోను టిక్ టాక్‌లో షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గంటల్లోనే ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.

also read :

Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. మాజీ రిపోర్టర్‌ కిడ్నాప్‌.. ఆపై హత్య!

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి కాస్త ఊరట.. ముందస్తు బెయిల్‌పై కోర్టు ఏమందంటే..

Exit mobile version