Homeviral newsviral video : నాన్న పుట్టిన రోజున.. డ్రీమ్‌ బైక్‌ గిఫ్టుగా ఇచ్చిన కుమారుడు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

viral video : నాన్న పుట్టిన రోజున.. డ్రీమ్‌ బైక్‌ గిఫ్టుగా ఇచ్చిన కుమారుడు.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

Telugu Flash News

viral video : చిన్ననాటి నుంచి కష్టాలకోర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. వయసు మీదపడినప్పుడు వారిని బాగా చూసుకోవడమే వారికిచ్చే గొప్ప బహుమతిగా భావించాలని చెబుతారు. అయితే, పిల్లల పెంపకం, కుటుంబ భారం, కష్టాలు వెరసి.. తల్లిదండ్రులు తమ కోర్కెలను చాలా వరకు కట్టడి చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో చిన్న చిన్న ఆశలు కూడా తీర్చుకోలేక జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు.

పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల డ్రీమ్స్‌ను నెరవేరిస్తే.. ఆ కిక్కే వేరప్పా.. అన్నట్లు ఉంటుంది కదూ.. తాజాగా వైరల్‌గా మారిన వీడియోలో ఓ తనయుడు ఇదే చేశాడు. తన తండ్రి కలలుగన్న బైక్‌ను 59వ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌గా ఇవ్వడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 2.7 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి.

ఉజ్వల్‌ సిద్నాగ్‌.. తన తండ్రిని సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నాడు. ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని భావించి తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న బాక్స్‌ను ఆయన చేతిలో పెట్టాడు. తండ్రి దాన్ని ఓపెన్‌ చేయగా.. తన ఫేవరెట్‌, డ్రీమ్‌ బైక్‌ కీ అందులో ఉంది. తర్వాత ఇంటి బయటకు కీ తీసుకొని రాగా.. అక్కడ తన డ్రీమ్‌ బైక్‌ రెడీగా ఉంది. దాన్ని చూసిన తండ్రికి ఒక్కసారిగా ఆనందభాష్పాలు వచ్చాయి. కుమారుడిని ప్రేమతో హగ్‌ చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈ సంతోషం వెలకట్టలేనిదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఆనందం ప్రైస్‌లెస్‌ నాన్నా..

నాన్నా.. యూ ఆర్‌ మై సూపర్‌ మ్యాన్‌. నీపై ప్రేమను వ్యక్తపరచడానికి పదాలు లేవు. నువ్వు మాపై చూపిన ప్రేమతో పోలిస్తే.. ఈ గిఫ్ట్‌ చాలా తక్కువ. ఈరోజు నీ కళ్లలో చూసిన ఆనందం వెలకట్టలేనిది… అంటూ ఉజ్వల్‌ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో పెట్టిన ఈ వీడియోకు విశేష ఆదరణ లభిస్తోంది. పలువురు యూజర్లు ఉజ్వల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News