Viral Video: చిన్న వాళ్ల నుండి పెద్ద వాళ్ల వరకు దీపావళి పండుగని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దేశ వ్యాప్తంగా క్రాకర్స్ కాల్చి ఈ ఫెస్టివల్‌ని సంతోషంగా జరుపుకుంటారు.
అయితే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమో లేదా ఎంజాయ్ చేయడం కోసమో తెలియదు కాని క్రాకర్స్‌ని కాస్త వెరైటీగా కాల్చి లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటారు.
దీపావళిలో బాణాసంచా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్స్ ట్రాలు చేస్తే ప్రాణానికే చాలా ప్రమాదం. ఎన్ని తుంటరి పనులు చేసినా బాణాసంచా కాల్చే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ప్రమాదం ఉందని తెలిసిన కూడా కొందరు టపాసులు కాల్చే విషయంలో కొంత తుంటరి పనులు చేసి వార్తలలో నిలుస్తుంటారు.
తుంటరి పనులు..
ఢిల్లీలో ఒకతను మాత్రం కారు మీద పటాకులు తీసుకొని పోయాడు. అంతే కాదు కారుపైనే వాటిని పేల్చాడు. ఆ వీడియో తీసిన సమయంలో పటాకులు ఓ ఐదుసార్లు పేలి ఉంటాయి. ఇదేంటి ఇలా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
ఆ వీడియోను వెనకాలే గల కారులో ఉన్న వ్యక్తి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో గురుగ్రామ్ పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకున్నారు. డ్రైవర్‌ను గుర్తించడమే కాక అరెస్ట్ కూడా చేశారు. అయితే ఆ కారు డ్రైవర్ తను వెహికిల్ ఇటీవలే మరొకరికి విక్రయించానని వివరించారు.
అక్టోబర్ 24న ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు.
రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు.
కారు చుట్టూ లక్ష టపాసులను వరసగా పేర్చగా కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం అంకెలు లెక్కపెడుతూ.. రెడీ అని కారుపై పేర్చిన బాంబులను పేల్చాడు.
#दिवाली से पहले शख्स ने कार पर पटाखे डालकर लगाई #आग, वीडियो वायरल #Diwali2022 #viralvideo pic.twitter.com/kDOrZVdqzs
— National Darpan (@NationalDarpan) October 23, 2022
కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ పగిలిపోయింది. కానీ, అన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పనిచేయడం గమనర్హం.
మరిన్ని వార్తలు చదవండి :
Bigg Boss 6: కెప్టెన్ అవ్వగానే హౌజ్‌మేట్స్‌ని రఫ్ఫాడిస్తున్న శ్రీహాన్..!
Viral Video: మితి మీరుతున్న రిస్కీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లు.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్