Telugu Flash News

Viral video : వందే భారత్‌లో పూర్‌ క్వాలిటీ ఆహారం సరఫరా..

vande bharat express

vande bharat express

Viral video : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. లేటెస్ట్‌ టెక్నాలజీతో రూపొందిన ఈ రైళ్లు.. ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా దూసుకెళ్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే దుండగులు వీటిపై రాళ్ల దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర రైల్వే శాఖ దర్యాప్తు కూడా చేపట్టింది.

టికెట్‌ రేట్లు భారీగా ఉండటం దీనికి మైనస్‌ పాయింట్‌గా చెబుతున్నారు ప్రయాణికులు. అయితే, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సర్వ్‌ చేసే ఆహారం విషయంలో తాజాగా ఓ వీడియో వైరల్‌గా మారింది. ఫస్ట్‌క్లాస్‌ జర్నీ చేస్తున్న ఓ ప్రయాణికుడికి సరఫరా చేసిన ఫుడ్‌లో క్వాలిటీ లోపించడం కనిపించింది. దీన్ని వీడియో తీసిన తోటి ప్యాసింజర్‌.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రయాణికుడికి సరఫరా చేసిన వడను పిండగా అందులోంచి నూనె కారిపోతోంది. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వందే భారత్‌ రైల్లో ఈఘటన చోటు చేసుకుంది.

ఈ ఘనతో రైల్వే ప్రయాణికులు బిత్తరపోతున్నారు. వందే భారత్‌లో ఫుడ్‌ తినడానికే భయపడుతున్నామంటున్నారు. వందే భారత్‌ రైలు చాలా బాగున్నా.. ఫుడ్‌ మాత్రం వెరీ బ్యాడ్‌ క్వాలిటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రైల్వే అధికారులు, ఐఆర్‌సీటీసీ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టికెట్‌ ధర భారీగా పెట్టి కొని ప్రయాణం చేస్తుంటా ఇలాంటి నాసిరకం ఫుడ్‌ పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోకు సోషల్‌ మీడియాలో భారీగా వ్యూస్‌ వస్తున్నాయి. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ (IRCTC) దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు రెస్పాండ్‌ అయ్యారు. సంబంధిత అధికారులకు ఈ విషయంపై సమాచారం అందించామన్నారు. ఏదేమైనప్పటికీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైల్లో ఫుడ్‌ క్వాలిటీపై దుమారం రేగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సీటీసీని ప్రయాణికులు కోరుతున్నారు.

also read:

Asia Cup 2023 వేదిక మార్పు! పాకిస్తాన్‌కు షాక్‌ తప్పదా?

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి బైడెన్‌..

Exit mobile version