Homeviral newsViral Video: కారు ప‌క్క‌న వెళ్లే వారు జ‌ర జాగ్ర‌త్త‌.. లేదంటే ఇలా ఉంటుంది..!

Viral Video: కారు ప‌క్క‌న వెళ్లే వారు జ‌ర జాగ్ర‌త్త‌.. లేదంటే ఇలా ఉంటుంది..!

Telugu Flash News

Viral Video: ప్ర‌మాదాలు ఎప్పుడు ఎలా ముంచుకొస్తాయో చెప్ప‌డం చాలా క‌ష్టం. మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా వెళ్లిన కూడా ప‌క్కోడి వ‌ల‌న ఒక్కోసారి ప్ర‌మాదంలో ప‌డాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంది. నిత్యం సోష‌ల్ మీడియాలో ప్ర‌మాదాల‌కు సంబంధించి ఎన్నో వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

అనుభవము లేని రోడ్డు పైకి వాహనం తీసుకుని వ‌చ్చి ప్ర‌మాదాలు చేస్తుంటే కొంద‌రు మాత్రం అన్నీ తెలిసినా నిర్లక్ష్యం వ‌ల‌న ఇంకొంద‌రి ప్ర‌మాదానికి కార‌ణం అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లో ఓ వ్యక్తి నిర్ల‌క్ష్యం అమాయ‌కుల ప్రాణాలు తీసింది.

అనుకోని ప్ర‌మాదం..

వివ‌రాల‌లోకి వెళితే కర్నాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద వీడియోను.. బెంగళూరు డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ కళా కృష్ణస్వామి.. తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు.

రద్దీగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి కారు నిలుపుకొని ఉండ‌గా, అదే సమయంలో ఇద్దరు యువకులు బైకు మీద వస్తుంటారు. అయితే వెన‌క వ‌స్తున్న బైక్‌ని చూసుకోని డ్రైవ‌ర్ ఒక్క‌సారి కారు డోరును తెరుస్తాడు.

కారు డోరు తగలడంతో బైకు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ లారీ మీదకు వెళ్ల‌డం మ‌నం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఆ స్పీడ్‌లో లారీకి తగిలి కింద ప‌డ్డ యువ‌కులు అప‌స్మార‌క స్థితికి వెళ్లిపోతారు. అయితే మెల్ల‌గా వ‌చ్చిన డ్రైవ‌ర్ యువ‌కుల‌ని ప‌ట్టించుకోకుండా బైక్ ద‌గ్గ‌ర‌కు వెళతాడు.

-Advertisement-

అస‌లు ఈ వీడియో చూస్తుంట‌నే క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు వ్యక్తుల ప్రాణాల మీదకు తెచ్చింద‌నేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. .

చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా, ఈ వీడియోని చూసి అయిన కారు ప‌క్క నుండి వెళ్లేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతున్నారు..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News