Thursday, May 9, 2024
Homeviral newsViral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?

Viral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?

Telugu Flash News

Viral Video of birds strange behavior before earthquake in turkey : టర్కీ, సిరియా దేశాలను భూకంపం అల్లకల్లోలం చేసింది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే దాదాపు వంద సార్లు భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరణాలు భారీగా నమోదు కావడంతో పాటు శిథిలాల కింద వేలాది మంది ఉండిపోయారని, శకలాలను తొలగించడానికే వారాలు, నెలల పాటు పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడ దయనీయ పరిస్థితులపై ప్రపంచమంతా కన్నీరు పెడుతోంది. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

భూకంపాలు తీవ్రంగా ఉండడంతో ఇప్పటికే దాదాపు 5 వేల మందికిపైగా మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఇంకా అనేక మందిని కాపాడాల్సి ఉంది. మరోవైపు భారత్‌ తనవంతు సాయంగా మెడికల్‌ కిట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తక్షణ సాయంగా పంపింది. దీంతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా టర్కీకి అండగా నిలబడుతోంది. ఏ సాయం కావాలన్నా చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అసలు భూకంపానికి ముందు ఆ దేశంలో ఏం జరిగిందనే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భూకంపం సంభవించేందుకు ముందుగా అక్కడ చెట్లపై, పరిసర ప్రాంతాల్లో పక్షులు విపరీతంగా శబ్దాలు చేశాయి. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రకృతి విపత్తులు పశుపక్ష్యాదులకు ముందే తెలిసిపోతాయనడానికి ఇది ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వీడియోలో పక్షులన్నీ పెద్ద పెద్ద అరుపులు చేస్తూ చెట్ల చుట్టూ, బిల్డింగుల చుట్టూ తిరగడం గమనించవచ్చు. ఆపద వచ్చే ముందు పక్షులు హెచ్చరించడాన్ని నెటిజన్లు కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఎత్తయిన చెట్ల చుట్టూ తిరుగుతూ పెద్ద సంఖ్యలో పక్షులు గుమిగూడాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టి మనుషులను అప్రమత్తం చేస్తున్నాయంటూ నెటిజన్లు చెబుతున్నారు.

also read : 

-Advertisement-

Kim Jong Un: 40 రోజుల నుంచి కనిపించని కిమ్‌.. ఉత్తరకొరియా అధినేతకు ఏమైంది?

victoria gowri : జస్టిస్‌ LCV గౌరి నియామకంపై దుమారం.. ఎందుకు ?

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News