Viral Video : ముంబైకి చెందిన ప్రహుఖ ఇన్‌ఫ్లూయెన్సర్ సిద్ధేశ్ లోకరే (Siddhesh Lokare) ఇప్పుడు వైరల్ న్యూస్ అయ్యాడు. ఇటీవల ఓ ప్రయోగం చేసిన సిద్ధేశ్.. ఆ ఘటనను వీడియో తీయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో భోజనం చేసిన ఆయన.. బిల్లు కట్టిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. ఇన్‌స్టా గ్రామ్ వేదికగా ఈ వీడియోను సిద్ధేశ్ లోకరే పంచుకున్నాడు.
ఈ ప్రయోగంలో భాగంగా వీడియోలో సిద్ధేశ్ వివరంగా అన్నీ తెలియజేశాడు. ఈ ప్రయోగం చేసేందుకు ఆయన ఓ లగ్జరీ సూట్‌ను వేసుకున్నాడు. హోటల్‌కు చేరుకోగానే ఒక యావరేజ్ పిజ్జాను, మోక్‌టైల్‌ను ఆర్డర్ చేశాడు. ముంబై వీధుల్లో తక్కువ ధరకు లభించే రగ్‌డా పూరీ ధర చూసి ఆశ్చర్యపోయాడు. దీని ధర ఇక్కడ ఏకంగా 800 రూపాయలు ఉండటం గమనించాడు. ఇక బిల్లు చెల్లింపు విషయానికి వచ్చే సరికి అసలు ట్విస్టు చూపించాడు.
అటెండెంట్ వచ్చే లోగా అప్పటికే తన పాకెట్‌లో తెచ్చుకున్న చిల్లరను బయటకు తీశాడు. ఆ చిల్లరను చూస్తూ.. నేషనల్ యూనియన్ చిల్లర పార్టీ అని లోకరే వ్యాఖ్యానించాడు. ఒక్కొక్కటిగా ఎంచుకుంటూ టేబుల్ మీద పెట్టసాగాడు. అక్కడే ఉన్న పలువురు ఈ ఘటనను ఆసక్తిగా తిలకించసాగారు. ఏం చేస్తున్నాడా? చిల్లరతో ఎలా డీల్ చేస్తాడని చూడటం మొదలు పెట్టారు. ఇంతలోనే అటెండెంట్‌అక్కడికి వచ్చాడు.
చిల్లరను సిద్ధేశ్ అక్కడ ఉంచి బిల్లు తీసుకోవాలని కోరాడు. దీంతో అటెండెంట్.. దీన్ని తాను లెక్క పెట్టుకుంటానంటూ తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో చిల్లరతో బిల్లు కట్టడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వెయ్యి రూపాయలకు పైన బిల్లు ఉంటే చిల్లరతో కట్టడం ఇల్లీగల్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. చిల్లర ఇచ్చి హోటల్‌కు ఎంతో సాయం చేశారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
also read :
health benefits of beans | బీన్స్ తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..