సమావేశం సందర్భంగా అక్కడికి చేరుకున్న జో బైడెన్ వైఫ్ జిల్ బైడెన్.. అందరినీ పలకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే కమలా హ్యారిస్ భర్త డగ్లస్ ఎమహాఫ్ కూడా ఉన్నారు. ఆయన్ను పలకరించే క్రమంలోనే నేరుగా లిప్‌లాక్ చేసి ముద్దు పెట్టింది జిల్ బైడెన్. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అసలు విషయం అందరికీ బోధపడింది.
ఈ వీడియో క్లిప్‌ను అమెరికాకు చెందని జర్నలిస్టు బెన్నీ జాన్సన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జిల్ బైడెన్.. కమలా హ్యారిస్ భర్తకు పెదవులపై ముద్దు పెట్టుకున్నారా? అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈ వీడియోకు వెంటనే వేలాదిగా లైక్స్, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్‌లో బైడెన్ మాట్లాడటం ఇది రెండో పర్యాయం. సుమారు పావు గంట పాటు ఆయన ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగంలో చైనాపై ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దేశం కోసం తాను ఎంతకైనా తెగిస్తానని స్పష్టం చేశారు. ఇటీవలే చైనాకు చెందిన నిఘా బెలూన్‌ను పేల్చి వేసిన విషయం తెలిసిందే. మరోవైపు తాజాగా బైడెన్ వైఫ్ చేసిన పని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Did Jill Biden just kiss Kamala's husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023
also read :
Dhanush Latest Movie Vaathi(Tamil) SIR (Telugu) Trailer
Hyderabad Traffic : ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు కార్ రేసింగ్.. నగరవాసులకు నరకం..